అదానీ గ్రూపునకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ విల్మార్ షేర్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. విల్మార్ లిమిటెడ్‌లో అదానీ గ్రూప్ తన వాటాను విక్రయించడానికి ప్రయత్నిస్తోందని చాలా కాలంగా బలమైన చర్చ జరిగింది. ఈరోజు ఈ అంశానికి ఆమోదం కూడా లభించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అదానీ విల్మార్ లిమిటెడ్ నుంచి నిష్క్రమించాలని అదానీ గ్రూప్ తన విక్రయాలను రెండు దశల్లో పూర్తి చేస్తుంది. అదానీ విల్‌మార్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మొత్తం…
Revanth Reddy Protest: టిపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం (డిసెంబర్ 18, 2024) “చలో రాజ్‌భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏఐసీసీ పిలుపు మేరకు అదానీ ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మనీ లాండరింగ్ వంటి అంశాలతో పాటు మణిపూర్ అల్లర్లు, విధ్వంసాలపై మోదీ సర్కార్ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఏఐసీసీ. దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. Also Read: Today…
Gudivada Amarnath : వైఎస్ జగన్‌పై గత 15 ఏళ్లగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఆదానీ దగ్గర లంచం తీసుకున్నారని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని, దుష్ప్రచారం ఆపకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి పై 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించారన్నారు. వాస్తవాలను ప్రజల ముందు వైఎస్ జగన్ ఉంచిన దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ గెజిట్ పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి అదే పనిగా తప్పుడు రాతలు…
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ టోటల్ ఎనర్జీస్ భారీ ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల్లో భాగంగా కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టబోమని సోమవారం తెలిపింది. గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు క్లియర్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది. అవినీతి విచారణ గురించి తమకు తెలియదని ఇంధన సంస్థ పేర్కొంది. బిలియనీర్ గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో టోటల్ ఎనర్జీస్ ఒకటి.
Bangladesh: అదానీకి వరసగా షాక్‌లు ఎదురవుతున్నాయి. విద్యుత్ ఒప్పందాల్లో అధికారులకు లంచాలు ఇచ్చాడని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. అయితే, అదానీ గ్రూప్ ఈ ఆరోపణల్ని ఖండించింది. ఈ ఆరోపణలు రావడంతో కెన్యా తమ దేశంలో అదానీ చేపడుతున్న కీలక ప్రాజెక్టుల్ని రద్దు చేసింది.
అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడని టీడీపీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని, సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారని, అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారన్నారు.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్ అదానీలపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) నోటీసు (సమన్లు) జారీ చేసింది. ఇందులో 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఇరువురిని ఆదేశించింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ పొందడానికి 265 మిలియన్ డాలర్లు (రూ. 2200 కోట్లకు పైగా) లంచం ఇచ్చారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే.
Gautam Adani: గౌతమ్ అదానీపై మరోసారి అమెరికా ఆరోపణలు చేసింది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు లంచం ఇచ్చారని అభియోగాలు ఎదుర్కొంటోంది.
Adani: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెన్యా దేశంతో అదానీ గ్రూపుతో చేసుకున్న భారీ ఒప్పందాలను రద్దు చేసుకుంది. కెన్యా రాజధాని నైరోబిలోని జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంపై నియంత్రణను అదానీ గ్రూపుకు అప్పగించాలని భావించిన సేకరణ ప్రక్రియను రద్దు చేయాలని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం ఆదేశించారు.