అదానీ గ్రూపునకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ విల్మార్ షేర్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. విల్మార్ లిమిటెడ్‌లో అదానీ గ్రూప్ తన వాటాను విక్రయించడానికి ప్రయత్నిస్తోందని చాలా కాలంగా బలమైన చర్చ జరిగింది. ఈరోజు ఈ అంశానికి ఆమోదం కూడా లభించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అదానీ విల్మార్ లిమిటెడ్ నుంచి నిష్క్రమించాలని అదానీ గ్రూప్ తన విక్రయాలను రెండు దశల్లో పూర్తి చేస్తుంది. అదానీ విల్‌మార్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మొత్తం వాటా 44 శాతం కలిగి ఉంది.
READ MORE: New Year 2025: న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
డిసెంబర్ 30న ఒప్పందంపై సంతకం చేసింది. ఒప్పందం ప్రకారం.. మొదటి దశలో.. అదానీ విల్మర్‌లో 31.06% వాటాను విల్మర్ ఇంటర్నేషనల్ పూర్తి యాజమాన్య సంస్థకు విక్రయించనుంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని 13% వాటాను బహిరంగ మార్కెట్‌లో అమ్మనుంది. ఇదిలా ఉండగా.. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో అదానీ విల్మార్ షేరు ధర రూ.329.50 స్థాయికి చేరుకుంది. గత రెండేళ్లలో కంపెనీ షేర్ల ధరలు 46 శాతం క్షీణించాయి. మరోవైపు.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఈరోజు 7 శాతం పెరిగి రూ.2593.45 స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే.. ఈ విక్రయం పూర్తయిన తర్వాత.. అదానీ కమోడిటీ నామినేట్ చేసిన డైరెక్టర్లు ఎమ్ఎమ్‌జీజీ కంపెనీ బోర్డు నుంచి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో.. కంపెనీ పేరు కూడా మారుతుంది. కాగా.. భారత వంట నూనెల మార్కెట్‌లో గణనీయ శాతం కలిగిన అదానీ విల్మర్, ఫార్చూన్ బ్రాండ్ పేరిట వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్యాకేజ్డ్ వంట సరకులను ఈ కంపెనీ అమ్ముతోంది.
READ MORE: KTR: మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం.. కేటీఆర్ రియాక్షన్ ఇదే(వీడియో)