Anam Venkata Ramana Reddy : అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడు
- గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారు
- సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారు
- అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారు
- జగన్.. ఆదానీల రహస్య చర్చ గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది : ఆనం వెంకటరమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anam Venkata Ramana Reddy : అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడని టీడీపీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని, సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారని, అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారన్నారు. జగన్ …ఆదానీల రహస్య చర్చ గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి చేయలేదని జగన్ అంటున్నాడని, తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోలుని అమెరికా కు పంపు అని ఆయన అన్నారు. రూ.1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నావని ఎఫ్. బి.ఐ. చెబుతోందని, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం అవినీతి కుంపటని టీడీపీ ఎప్పుడో చెప్పిందని, సోలార్ విద్యుత్ ను యూనిటకు 11 రూపాయలకు కొన్నారు… టెక్నాలజీ మారే కొద్దీ ధరలు తగ్గుతూ వచ్చాయని, 9 వేల మెగావాట్లకి 1750 కోట్లు సరే… ఇంకా అనేక సోలార్ సంస్థలకు పీపీఏ లు చేశారు… వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నారో బయటకి తీయాలని ఆయన అన్నారు. సోలార్ పవర్ ఒప్పందాల్లో రూ. 20 వేల కోట్ల రూపాయల లంచం జగన్ కు ముట్టిందని ఆనం ఆరోపించారు.
Also Read
అంతేకాకుండా..’టీటీడీకి అన్యాయం చేసాడు… అందుకే ఆ స్వామి అమెరికా లో కేసు పెట్టించాడు… ఇక్కడ చట్టాలు మాదిరిగా అక్కడ ఉండదు… 6 నెలల్లో తీర్పు వస్తుంది… అపారమైన జ్ఞానం కలిగిన రిటైర్డ్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చింది… ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయం చేయాలి…. త్వరగా జగన్ ను లాక్కెళ్లాలి.. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి శునకానందం పొందాడు…. అందుకే దేవుడు సరైన శిక్ష వేయబోతున్నాడు… ఈ అభియోగాలు తేలేవరకు జగన్ వైసీపీ అధ్యక్షుడుగా దిగిపోవాలి… జగన్ కేసులకి 11 ఏళ్ళు అయ్యింది… సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చొరవ తీసుకుని కేసుల వ్యవహారంలో వేగం పెంచాలి…’ అని ఆనం వెంకట రమణ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!