Uddhav Thackeray: బీజేపీ ‘‘అమీబా’’ లాంటిది..
- బీజేపీపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు..
- బీజేపీ అమీబా లాంటిదని ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే గురువారం ముంబైలోని శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీ కార్యక్రమంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ‘‘అమీబా’’ లాంటిదని ఉద్ధవ్ విమర్శించారు. ‘‘బీజేపీ తనకు నచ్చిన విధంగా వ్యాపిస్తుంది. తనకు నచ్చని విధంగా పొత్తులును ఏర్పరుచుకుంటుంది. పని పూర్తయిన తర్వాత, మరోదానికి మారుతుంది. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే కడుపు నొప్పి కలిగిస్తుంది. సమాజంలోకి ప్రవేశించినప్పుడు శాంతిక భంగం కలిగిస్తుంది’’ అని ఆయన అన్నారు.
Read Also: Pakistan: పాకిస్తాన్ పెషావర్‌లో బాంబు పేలుడు.. 9 మంది మృతి..
Also Read
బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని నకిలీ హిందుత్వ అని, అవకాశవాదం అని ఉద్ధవ్ ఆరోపించారు. ‘‘ఒక గాడిద పులి చర్మాన్ని ధరించింది’’అని తన ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజమైన హిందుత్వ వారసత్వం తనతో ఉందని అన్నారు. హిందుత్వ పరిధిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల్ని ఠాక్రే తప్పుపట్టారు. ఆర్ఎస్ఎస్ దశాబ్ధాలుగా ‘‘విభజన విష ఫలాలను’’ ఇచ్చిందా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్లడాన్ని, పాకిస్తాన్ తో క్రికెట్ ఆడటాన్ని, బిల్కిస్ బానో కేసులో దోషులకు బీజేపీ మద్దతు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ, హిందూ విలువలపై ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వద్దని ఠాక్రే చెప్పారు.
సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌పై స్పందిస్తూ.. న్యాయం కోసం పోరాడటం ఇప్పుడు దేశద్రోహంగా ఉందని అన్నారు. ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే, ముంబైని అదానీకి అప్పగిస్తుందని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?