ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. తనపై హనీట్రాప్ జరిగిందని చెప్పడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, తమ పార్టీ ఎమ్మెల్యేలపై బీజేపీ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందన్న ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తోన్న క్రమంలో, హనీట్రాప్ వ్యవహారం దుమారం రేపుతోంది. తనను హనీట్రాప్ చేసేందుకు ఎవరో కుట్ర చేశారంటూ, వాట్సాప్ చాట్ కు…
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో వివాహం అత్యంత సాదాసీదాగా జరిగింది. చంఢీగఢ్ లోని సెక్టార్ 2లోని ముఖ్యమంత్రి ఇంటి వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. సన్నిహితులు, బంధువులతో పాటు ఆప్ జాతీయ కన్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేత రాఘవ్ చద్ధా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన డాక్టరైన గురుప్రీత్ కౌర్ ను భగవంత్ మాన్ పెళ్లి చేసుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు…
ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది మొదట్లో ఈ షాపింగ్ ఫెస్టివల్ ను ఢిల్లీలో నిర్వహించనున్నారు. దీన్ని ప్రపంచంలో అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ గా తీర్చిదిద్దనున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. 2023 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. 30 రోజుల పాటు ఈ ఫెస్టివల్ ను నిర్వహించనుంది…
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రేపు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వివాహం అయిన 48 ఏళ్ల మాన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆరేళ్ల క్రితం తన భార్య ఇంద్రప్రీత్ కౌర్ కు విడాకులు ఇచ్చాడు సీఎం మాన్. అయితే తాజాగా మరో అమ్మాయిని పెళ్లిచేసుకోబోతున్నాడు. అత్యంత సన్నిహితులు, కుటుంబీకుల సమక్షంలో చంఢీగడ్ లో వివాహం జరగనుంది. పంజాబ్ లో తొలిసారి పాగా వేసిన ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పెళ్లి చేసుకునే అమ్మాయి…
పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ కీలక నేత భగవంత్ మాన్ రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. రేపు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో భగవంత్ మాన్ వివాహం జరగనుంది. తన ఇంట్లోనే పెళ్లి కార్యక్రమం జరగనున్నట్లు తెలిసింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హజరుకానున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యే అవకాశం ఉంది. భగవంత్ మాన్ కి ఇది రెండో పెళ్లి, 48 ఏళ్ల…
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించి కొన్ని నెలలు కాకముందే ఉప ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఏకంగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ గతంలో ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన సంగ్రూర్ లోక్ సభ స్థానంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ స్థానం నుంచి శిరోమణి అకాలీదళ్(అమృత్సర్) అభ్యర్థి సిమ్రన్ జిత్ సింగ్ మాన్ గెలుపొందారు. హోరాహోరీగా జరిగిన పోరులో ఆప్ అభ్యర్థి గుర్మైల్ సింగ్‌పై 5,800 ఓట్ల తేడాతో విజయం సాధించారు.…
రాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దేశరాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు… కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. తాము నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని.. కాంగ్రెస్, దాని మిత్రాలను కోరనుంది బీజేపీ. ఇందులో భాగంగా విపక్షాలతో చర్చల జరిపే బాధ్యతను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అప్పగించింది. విపక్షాలు అభ్యర్థిని నిలబెట్టకుండా.. తాము నిలిపే అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరేందుకు సిద్ధమయ్యాయి. ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే అభ్యర్థిని…
ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సత్యేందర్ జైన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోల్ కతాకు చెందిన ఓ సంస్థకు సంబంధించిన హవాలా లావాదేవీల్లో ఢిల్లీ ఆరోగ్య, హోం మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ అయ్యారు. తాజాగా ఆయన నివాసంతో పాటు అతని సహాయకుడి నివాసంలో మంగళవారం ఈడీ భారీ ఎత్తున సోదాాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భారీ ఎత్తున బంగారం, నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ. మొత్తం రూ.…
డ్రగ్స్, మాఫియా, సెలబ్రిటీ హత్య…వరుస వివాదాలు ఏం చెప్తున్నాయి?ఆప్ ప్రభుత్వం ముందు అన్నీ సవాళ్లేనా?పంజాబ్ మళ్లీ ఖలిస్తాన్ గా మారబోతోందా?తీవ్రవాదం, మాఫియాతో రగిలిపోనుందా? పంజాబ్‌లో ఏం జరుగుతోంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.ఆ రాష్ట్రలో ఏం జరుగుతోంది?ఏం జరగబోతోందనే ఆందోళన పెరుగుతోంది.నిజానికి అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వివాదాలు మాత్రం కామన్. డ్రగ్స్ మాఫియా, ఇటీవల రైతు ఉద్యమాలు, ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీ హత్య..ఇలా నిత్యం ఏదో వివాదంలో నిలుస్తోంది.ఇప్పుడు ఖలిస్తాన్ నినాదం మళ్లీ…