Manish Sisodia: మనీష్ సిసోడియాను సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ.. 100 మంది ఆప్ నేతల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. సిసోడియాను దాదాపు 9గంటల పాటు ప్రశ్నించారు. సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్దకు ఉదయం 11.00 గంటలకు మనీష్ సిసోడియా చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులను ఎందుకు కలిశారని ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విజయ్ నాయర్‌ను ఎందుకు కలిశారు?.. మద్యం పాలసీ విధానం ఆయనను ఎందుకు భాగస్వామ్యం చేశారు అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వల్ల ఢిల్లీ సర్కారు ఆదాయం పడిపోతుందని మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. అలా చేయడం వల్ల ప్రభుత్వం ఎవరు లబ్ధి పొందుతారనే కోణంలో సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
నూతన మద్యం పాలసీలో కొద్ది మంది వ్యాపారులను ఎందుకు ఎంపిక చేశారని సిసోడియాను ప్రశ్నించారు. ప్రభుత్వం, వ్యాపారస్తుల మధ్య క్విడ్ ప్రొకో జరిగిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ రూపకల్పనలో తెలంగాణ వ్యక్తులను కలిశారా అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రామచంద్ర పిళ్లై, శరత్ చంద్ర, రాఘవరెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
Also Read
CJI Justice DY Chandrachud: సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్.. కేంద్రం ఆమోదం..
ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అనవసరంగా కేసులో ఇరికించి ప్రశ్నిస్తున్నారంటూ వందలాది మంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు సీబీఐ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. నిరసనలను అడ్డుకునేందుకు ఆ ప్రాంతంలో పోలీసులు మోహరించారు. ఇప్పటికే 100 మందిని అరెస్ట్ చేయగా.. వారిలో మంత్రి సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. అరెస్ట్ సమయంలో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అరెస్టైన వారందరీని ఫతేపుర్ బేరి ప్రాంతానికి పోలీసులు తరలించారు.
అంతకు ముందు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీకి వ్యతిరేకంగా మనీష్ సిసోడియా ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా బీజేపీ ప్లాన్‌లో భాగంగా తనను నకిలీ కేసులో అరెస్టు చేయనున్నారని సిసోడియా ఆరోపణలు చేశారు. అటు మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై సీబీఐ జరుపుతున్న దర్యాప్తునకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో అర్వింద్ కేజ్రీవాల్ ముడిపెట్టారు. మనీష్ సిసోడియాను డిసెంబరు 8 వరకు జైల్లో పెట్టబోతున్నారంటూ సోమవారంనాడు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!