political heat on currency notes : తెగని నోట్ల పంచాయితీ.. ఆప్, బీజేపీ మధ్యలో కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
political heat on currency notes : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల వేళ కరెన్సీ నోట్లపై ముద్రించే చిత్రాల వివాదం ముదురుతోంది. కరెన్సీ నోట్లపై దేవతామూర్తులైన గణేష్, లక్ష్మీదేవి చిత్రాలు ముద్రించాలంటూ ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మను ముద్రించాలనే డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. అంబేద్కరిస్టులు సహా కొంత మంది లౌకిక వాదులు ఈ డిమాండ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అసలు నోటుపై ఎవరిదైనా చిత్రాన్ని ముద్రించాలంటే అన్ని విధాలా అర్హుడైన వ్యక్తి అంబేద్కరేనని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. అయితే 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నుంచి.. ఇలాంటి డిమాండ్ రావడం పట్ల కొంత ఆశ్చర్యం, కొంత ఆసక్తిని రేపుతోంది.
Read Also: PM Modi: కింద పోలీస్ స్టేషన్.. పైన ఇళ్లు.. మోదీ సార్ ప్లాన్ అదుర్స్
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మనీష్ తివారి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘కొత్త సిరీస్ కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో ఎందుకు ఉండకూడదు? నోటుకు ఒకవైపు ఘనతవహించిన మహాత్మా గాంధీ బొమ్మ, మరో వైపు డాక్టర్ అంబేద్కర్ బొమ్మ ఉండాలి. అహింస, రాజ్యాంగవాదం, సర్వసమానత్వం విశిష్ట సమ్మేళనంలో లీనమవుతాయి. అలాంటపుడు ఆధునిక భారతీయ బుద్ధి కుశలత అత్యంత కచ్చితమైన రీతిలో వ్యక్తమవుతుంది’’ అని రాసుకొచ్చారు.
భారత కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలు ముద్రించాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియా ఓ ముస్లిం దేశం..అక్కడ హిందువులు కేవలం రెండు శాతం మాత్రమే ఉంటారు. అటువంటి ఇండోనేషియా కరెన్సీపై హిందూ దేవుడైన గణేషుడు బొమ్మను ముద్రించారని..అటువంటిది మన భారత కరెన్సీపై దేవతల బొమ్మలు ముద్రించాలని కోరారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాలో మాట్లాడుతూ ఈ ప్రతిపాదన చేశారు.
Read Also: Jammu Kashmir: ఆ గ్రామంలో ఉన్న ఒక్క మహిళ వెళ్లిపోయింది.. ఇప్పుడు ఏంటి పరిస్థితి?
1969లో తొలిసారి గాంధీ శత జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రాలున్న నోట్లు అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు గుళ్లు, గోపురాలు,, ఉపగ్రహాలు, ఆనకట్టల వంటివి ముద్రించారు. 1935లో ఆర్బీఐ ఏర్పాటయ్యాక 1938లో తొలిసారిగా రూపాయి నోటు ముద్రించింది. 1949లో జాతీయ చిహ్నమైన నాలుగు సింహాలు, అశోక స్థూపాన్ని నోట్లపై ముద్రించారు.
- Tags
- AAP
- ambedkar
- bjp
- Currency Notes
- gandhi
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!