Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Will Jacks: ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్ 2026’ టోర్నీలో గురువారం (ఆగస్టు 6) నాడు లండన్ స్పిరిట్, ఎంఐ లండన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. లండన్ లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఎంఐ లండన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ఫలితానికి మించి అందరి దృష్టిని ఆకర్షించింది స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్.
లండన్ స్పిరిట్ బ్యాటర్ లువాన్ డ్రే ప్రిటోరియస్ భారీ షాట్ కొత్తగా.. బంతి సిక్స్‌కు వెళ్లేలా కనిపించింది. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న విల్ జాక్స్ ముందుగా బంతిని బౌండరీ దాటకుండా అడ్డుకున్నాడు. ఆ తర్వాత మైదానంలోకి తిరిగి వచ్చి ఫుల్ లెంగ్త్ డైవ్ చేస్తూ ఒకే చేతితో అద్భుత క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ చూసి బ్యాటర్‌తో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ క్యాచ్ తో మ్యాచ్ మలుపు తిప్పింది.
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
ఈ లండన్ డెర్బీ మ్యాచ్‌ను వీక్షించేందుకు 27,721 మంది ప్రేక్షకులు లార్డ్స్‌కు హాజరయ్యారు. ది హండ్రెడ్ గ్రూప్ దశలో ఇది రికార్డు స్థాయి ప్రేక్షకుల హాజరు. జేమీ ఓవర్టన్, జేమ్స్ కోల్స్ చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయడంతో లండన్ స్పిరిట్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఇక 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ లండన్‌కు విల్ జాక్స్ ఓపెనర్‌గా వచ్చి 18 పరుగులు మాత్రమే చేశాడు. అయితే బ్యాటింగ్ కంటే అతని అద్భుత క్యాచ్‌నే అభిమానులు ఎక్కువగా గుర్తుంచుకున్నారు. చివర్లో సికందర్ రజా కేవలం 16 బంతుల్లో 32 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇంకా 6 బంతులు మిగిలి ఉండగానే ఎంఐ లండన్ లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ONE OF THE GREATEST CATCHES EVER IN LEAGUE HISTORY 🤯
– WILL JACKS HAS TAKEN A STUNNER. pic.twitter.com/9H8OOvLOzj
— Johns. (@CricCrazyJohns) August 6, 2026
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!