Arvind Kejriwal: గుజరాత్‌పై మార్పు తుఫాన్ దూసుకుపోతోందని. తమ పార్టీ తదుపరి ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన కేజ్రీవాల్.. గుజరాత్‌లో 27 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, ఆప్‌కు ఓటేయడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో కేజ్రీవాల్ ప్రస్తుతం రెండు రోజుల పర్యటనలో ఉన్నారు.
ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం .. గుజరాత్‌లో ఆప్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఆప్ 92-93 సీట్లు గెలుపొందడంతో గట్టి పోటీ ఉంటుందని, కానీ దాదాపు 150 సీట్లు రావాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం పూర్తిగా వృథా అవుతుందని, ఆ పార్టీ కేవలం పది సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని, ఆ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి మారతారని విమర్శించారు.
వడోదరాలో కొందరు పిల్లలు మోడీకి అనుకూలంగా నినాదాలు చేయడం తాను చూశానని ప్రధాని నరేంద్ర మోదీపై ఆప్ నాయకుడు మండిపడ్డారు. మీరు ఎందుకు నినాదాలు చేస్తున్నారని తాను వారిని అడిగినప్పుడు, వారు దాని కోసం డబ్బులు ఇచ్చారని సమాధానం చెప్పినట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న అన్ని తప్పుడు కేసులను ఎత్తివేస్తామని.. అది ఆప్ అజెండాలోని మొదటి అంశమని కేజ్రీవాల్ అన్నారు. 20వేల క్లినిక్‌లను నిర్మిస్తామని, 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,000 జమ చేస్తామని, 6.5 కోట్ల గుజరాతీలకు ఉచిత వైద్యం అందించడం, పది లక్షల కొత్త ఉద్యోగాలు, ఇళ్లకు ఉచిత విద్యుత్ సరఫరా, రైతులకు ఐదు పంటలకు కనీస మద్దతు ధర అందిస్తామని గుజరాత్‌లో ఆప్ వాగ్దానాల వర్షం కురిపించింది.
Baba Ramdev: సల్మాన్‌ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో అవినీతి విపరీతంగా ఉందని పేర్కొన్న కేజ్రీవాల్.. గుజరాత్ వార్షిక బడ్జెట్ రూ.2.5 లక్షల కోట్లని చెప్పారు. ఆ నిధులు మీకెంతా చేరాయో చెప్పాలని ఓటర్లను ప్రశ్నించారు. మీ ఏరియాలో ఏదైనా స్కూల్, కాలేజీ, హాస్పిటల్ కట్టడం చూశారా? అంటూ ప్రశ్నించారు. అవినీతి మంత్రిని కటకటాల వెనక్కి నెట్టిన ఆప్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను ఉదాహరణగా చెప్తూ.. గుజరాత్‌లో ఆప్ అధికారంలోకి వస్తే, అవినీతిపరుల నుంచి నల్లధనం మొత్తాన్ని వెనక్కి రప్పించి రాష్ట్రాన్ని ఆదుకుంటామని కేజ్రీవాల్ అన్నారు. అవినీతి రహిత ప్రభుత్వం వస్తే ప్రజలు పని చేయడానికి లంచాలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.