Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
- నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వీక్షణల నాన్-ఇంగ్లీష్ మూవీ
- 37 మిలియన్ వ్యూస్‌తో గ్లోబల్ సంచలనం
- 22 దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో 'ధురంధర్'
- భారతీయ కంటెంట్‌కు పెరుగుతున్న ప్రపంచ ఆదరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar : బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలు (వ్యూస్) సాధించిన నాన్-ఇంగ్లీష్ సినిమాగా ఈ చిత్రం చారిత్రాత్మక రికార్డు నమోదు చేసింది. ఈ విషయాన్ని ‘ఎక్స్‌ప్రెస్ అడ్డా’ వేదికగా నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవో టెడ్ సరాండోస్ అధికారికంగా వెల్లడించారు.
గ్లోబల్ చార్ట్స్‌లో టాప్.. వ్యూస్‌తో సంచలనం
ఈ ఏడాది అమెరికా, యూకే సినిమాల తర్వాత అంతర్జాతీయంగా అత్యధికంగా వీక్షించిన చిత్రంగా ‘ధురంధర్’ నిలిచిందని టెడ్ సరాండోస్ కొనియాడారు. గణాంకాల ప్రకారం 2026 జనవరి నుండి జూన్ మధ్య కాలంలోనే ఈ సినిమా ఏకంగా 3.7 కోట్ల (37 మిలియన్లు) వీక్షణలను సొంతం చేసుకుంది. అంతంత మాత్రమే కాకుండా, ఏకకాలంలో ఏకంగా 22 దేశాలలో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానంలో నిలిచి భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది.
Also Read
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
రూ. 3,100 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర
సంచలన దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీ, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 3,100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డులు తిరగరాసింది. 2025 డిసెంబర్లో వచ్చిన మొదటి భాగం ఊహించని విజయాన్ని అందుకోగా, ఈ ఏడాది మార్చిలో విడుదలైన సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ భారత్‌లోనే ఏకంగా రూ. 1,000 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.
అంతర్జాతీయంగా పెరుగుతున్న భారతీయ కంటెంట్ క్రేజ్
ప్రపంచవ్యాప్తంగా భారతీయ కంటెంట్‌కు ఆదరణ విపరీతంగా పెరుగుతోందని ఈ సందర్భంగా టెడ్ సరాండోస్ హర్షం వ్యక్తం చేశారు. 2024 నుంచి ప్రతీ వారం ఏదో ఒక భారతీయ చిత్రం లేదా సిరీస్ నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 జాబితాలో నిలుస్తూ వస్తోందని ఆయన గుర్తుచేశారు. ‘స్క్విడ్ గేమ్’ లేదా ‘మనీ హీస్ట్’ లాంటి గ్లోబల్ హిట్స్ భారత్ నుంచి ఎప్పుడు వస్తాయని చాలామంది ప్రశ్నిస్తుంటారని, కానీ భారతీయ సినిమాలు ఇప్పటికే ఆ స్థాయి ఘనతను నిరూపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!