Aam Admi Party: ‘మీ ముఖ్యమంత్రిని ఎన్నుకోండి’.. గుజరాత్ ఎన్నికల కోసం ఆప్ పోల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aam Admi Party: ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీపై గెలిచేందుకు ఆప్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆప్ కన్వీనర్ గుజరాత్‌లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తున్నారు. పంజాబ్ మాదిరిగా తమ ముఖ్యమంత్రి ఎవరో ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను ఆప్ కల్పించింది. శనివారం గుజరాత్ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు క్రౌడ్ సోర్సింగ్ ప్రచారాన్ని ప్రారంభించారు. శనివారం ఉదయం మీడియా సమావేశంలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘తదుపరి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? దయచేసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి’’ అని కోరారు. 6357000360 నంబర్ కు వాయిస్ మెస్సేజ్, వాట్సాప్, ఎస్ఎంఎస్ లను నవంబర్ 3 నాటికి పంపించాలని సూచించారు.
రాష్ట్రంలో దూకుడుగా ప్రచారం చేస్తూ, ర్యాలీలు నిర్వహిస్తూ, ఉచిత విద్యుత్, మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు వంటి అనేక వాగ్దానాలు చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్.. “మీ ముఖ్యమంత్రిని ఎంచుకోండి” అంటూ పోల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో పంజాబ్ ఎన్నికలకు ముందు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించి, వారిలో మీ మద్దతు ఎవరికో తెలియజేయాలని ఆప్ ప్రజలను కోరడం తెలిసిందే. మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు భగవంత్ మాన్‌ను ఎంపిక చేసింది. ఈ తరహాలోనే గుజరాత్‌లో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ మెయిల్ ఐడీని కూడా ప్రకటిస్తామన్నారు. ఫలితాలను 4న వెల్లడిస్తామని చెప్పారు. అలాగే, పనిలో పనిగా అధికార బీజేపీపై ఆయన విమర్శలు చేశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Imran khan: భారత్‌పై ఇమ్రాన్‌ఖాన్ మరోసారి ప్రశంసల వర్షం.. ‘పాకిస్థానీలు బానిసలు’
తదుపరి ఐదేళ్ల విషయంలో బీజేపీ వద్ద ప్రణాళిక ఏదీ లేదని కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఏడాది క్రితం వారు ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీని తొలగించి భూప్రేంద పటేల్‌ను నియమించారని.. ఆ సందర్భంలో ప్రజల అభిప్రాయాన్ని కోరలేదన్నారు. కానీ తాము అలా చేయమని.. ఆప్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటుందని అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వారు గుజరాత్‌కి తదుపరి ముఖ్యమంత్రి అవుతారన్నారు. కాబట్టి ఈ రోజు మీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో చెప్పాలని తాము ప్రజలను కోరుతున్నామన్నారు.182 మంది సభ్యులున్న గుజరాత్ శాసనసభకు ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే, పోలింగ్ తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!