Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- కుళ్లిన మాంసం, బూజు పట్టిన కూరగాయలు..
- బెంగళూర్ 3, 5-స్టార్ హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణం..
- కర్ణాటక అధికారుల తనిఖీల్లో వెలుగులోకి ప్రముఖ హోటళ్ల బాగోతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: కుళ్లిన మాంసం, గడువు తీరిన పాల ప్యాకెట్లు, బూజు పట్టిన కూరగాయలు.. ఇదేదో రోడ్ సైడ్ చిన్న హోటళ్లలో ఉన్న అపరిశుభ్రత కాదు. దేశ టెక్ రాజధాని బెంగళూర్‌లో 5-స్టార్ హోటళ్లలో కంపు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని ప్రముఖ హోటళ్లలో రైడ్స్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తూపోయే వాతావరణం కనిపించింది.
3 స్టార్, 5 స్టార్ హోటళ్లలో నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో తీవ్ర ఆహార భద్రత ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. తాజ్ యశ్వంత్‌పూర్, శాంగ్రి-లా, రాడిసన్ బ్లూ, ఫోర్ సీజన్స్, ది లలిత్ అశోక్, వివాంతా వంటి ప్రముఖ హోటళ్లలో ఎక్స్పైర్ అయిన పాలు, కుళ్లిన మాంసం, ఫంగస్ పట్టిన కూరగాయలను చూసి కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారులు షాక్ అయ్యారు. సంబంధిత హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
కర్ణాటక ఆరోగ్య మంత్రి యూటీ ఖాదర్ ఆదేశాల మేరకు 30 ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందాలు బెంగళూర్ అర్బన్ జిల్లాలోని 26 హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం హోటళ్లు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. తనిఖీల్లో చికెన్, మటన్, ఫిష్, వంట నూనె, పాలు, మసాలా దినుసుల వంటి 35 ఫుడ్ శాంపిళ్లను సేకరించి ప్రయోగశాలకు పంపారు. నివేదిక ఆధారంగా ఆయా హోటళ్లపై చర్యలు తీసుకోనున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?