ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా వున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేజ్రీవాల్ నివాసంలో కేసీఆర్ భేటీ ముగిసింది. గంటన్నర పాటు కేసీఆర్, కేజ్రీవాల్ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం చండీగఢ్ బయలు దేరారు సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్. కేసీఆర్ కారులోనే బయలు దేరారు కేజ్రీవాల్. ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చండీగఢ్‌కు పయనమయ్యారు. గాల్వన్ వ్యాలీ అమరవీరుల జవానులకు నివాళులు అర్పించారు కేజ్రీవాల్, కేసీఆర్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. అనంతరం రైతు ఉద్యమంలో చనిపోయిన 600 రైతు…
దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని గతంలో ప్రకటించిన గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు. తాజాగా కేసీఆర్ జాతీయస్థాయి పర్యటనలో కీలక భేటీలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఫ్రంట్‌లు కాదు.. ప్రత్యామ్నాయ అజెండా కావాలని అన్నప్పుడే వివిధ పార్టీల నేతలతో సమావేశమై చర్చించారు కేసీఆర్. తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతోపాటు ప్రగతి భవన్‌కు వచ్చిన పలు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చలను…
దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. బుల్డోజర్లలో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ బుల్డోజర్ కూల్చివేతల వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొన్ని ఢిల్లీలోని కొన్ని ఏరియాల్లో కూల్చివేతలకు వ్యతిరేఖంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తీవ్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార ఆప్, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు ఎంతగా వ్యతిరేఖించినా ఢిల్లీ మున్సిపల్ అధికారులు తగ్గడం లేదు. పోలీసులు, సీఆర్ఫీఎఫ్ భద్రత నడుమ ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని…
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.. దీంతో, ఢిల్లీ పరిమితం అనుకున్న ఆ పార్టీ.. మరో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.. ఇక, ఢిల్లీలో పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి.. పంజాబ్‌లో పరిస్థితి వేరు.. తాము ఏంటో చూపిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే అనేక సంస్కరణలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారు సీఎం భగవంత్ మాన్ సింగ్.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆప్ ప్రభుత్వం.. ఆ…
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే ఉంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరులో పర్యటించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రావణుడి అహంకారం లాగా.. కేంద్రానికి కూడా అహంకారం వుందని విమర్శించారు. అందుకే సాగు చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. రైతులతో చెలగాటాలొద్దని తాము బీజేపీని పదే పదే హెచ్చరించినా.. పెడ చెవిన పెట్టిందని, చివరికి…
తెలంగాణలో వరి కొనుగోలుకి సంబంధించి బీజేపీ-టీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తున్నాయి. రెండుపార్టీల వైఖరిపై తెలంగాణ జనసమితి నేత ఫ్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఇద్దరూ అలా గొడవపడితే ఎలా? పరిష్కారం చేయకుంటే తప్పుకోండి. కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకోలేదు. కేంద్రం-రాష్ట్రం వివాదాల్లో గవర్నర్ కి టార్గెట్ చేశారు. గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. గవర్నర్ వ్యవస్థని అగౌరవపరిస్తే తమను తాము అవమానించుకోవడమే. రాజ్యాంగ వ్యవస్థ గౌరవం కాపాడాలి. గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల విషయంలో…
తెలంగాణలో వేసవి తాపం పెరుగుతోంది. దాంతో పాటే రాష్ట్రంలో రాజకీయ వేడి కూడా పెరిగిపోతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వైఎస్ఆర్టిపి వంటి అన్ని విపక్ష పార్టీలు అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా పాదయాత్రలు, బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ ఆధిపత్యం పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఐతే, గత రెండు మూడేళ్లుగా తెలంగాణలో బీజేపీ తన ఉనికిని గట్టిగా…
దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం అవుతుంది అనుకున్న ఆమ్ఆద్మీ పార్టీ.. క్రమంగా విస్తరణ చర్యలు ప్రారంభించింది.. తాజాగా ఎన్నికలు జరిగిన పంజాబ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. తిరుగులేని విజయాన్ని అందుకుని ఔరా..! అనిపించింది.. ఈ విజయం ఆ పార్టీ నేతలకు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.. పార్టీలో కొత్త జోష్ వచ్చింది.. ఇదే సమయంలో 2024లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెడుతోంది ఆమ్ఆద్మీ పార్టీ.. ఇవాళ హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఆప్ తీర్థం…
అందరూ ఊహించినట్లే జరిగింది. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆమ్ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా బరిలోకి దించింది. పంజాబ్ నుంచి రాజ్యసభ సీటు కోసం తమ పార్టీ అభ్యర్థిగా హర్భజన్ సింగ్‌ను ఆప్ ప్రకటించింది. ఈ మేరకు భజ్జీ.. సోమవారం ఛండీగఢ్‌లో నామినేషన్ దాఖలు చేశాడు. ఆప్ రాజ్యసభ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించాడు. ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ కాసేపు మీడియాతో మాట్లాడాడు. క్రీడల్లో…
పంజాబ్ నూతన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విప్లవవీరుడు భగత్‌సింగ్ ను ఎంతో ఆరాధిస్తాడు. ఎంతలా అంటే తన ప్రమాణస్వీకారానికి భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామాన్ని ఎంచుకున్నారు. బసంతి తలపాగా ధరించి అచ్చు భగత్‌సింగ్‌లా దర్శనమిచ్చారు. ఐతే, సీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ ఫొటోపై ఇప్పుడు వివాదం రేగింది. ఆ ఫొటోలో ఆయన బసంతి తలపాగా (పసుపు రంగు తలపాగ) ధరించి ఉంటమే వివాదానికి కారణం. ఆ ఫొటో ప్రామాణికతపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రకారుల ప్రకారం ఇది…