AAP MLA : పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే నరీందర్ కౌర్ ఆ పార్టీ కార్యకర్త అయిన మణ్‌దీప్‌ను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి పటియాలాలోని రోరేవాల్ గ్రామంలోని ఓ గురుద్వారాలో జరిగింది. ఈ పెళ్లికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య గుర్ప్రీత్ కౌర్‌తో సహా మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితులు వారి పెళ్లిని వీక్షించి వధూవరులను ఆశీర్వదించారు.
Read Also: Digital Rupee: డిజిటల్ కరెన్సీ వచ్చేస్తోంది.. ఆర్బీఐ కీలక ప్రకటన
నరీందర్ కౌర్ 2014 లో లోక్ సభ ఎన్నికల సమయంలో తన గ్రామంలో ఒంటరిగా ఆమ్ఆద్మీ పార్టీ బూత్ ఏర్పాటు చేసి అందరి దృష్టి ఆకర్షించారు. అనంతరం భగవంత్ మాన్ ప్రోత్సాహంతో రాజకీయాలపై దృష్టి పెట్టారు. కాగా ఈ ఏడాది జూలైలో సీఎం భగవంత్ మాన్ పెళ్లి జరిగింది. ఆయన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ని వివాహం చేసుకున్నారు. పదవిలో ఉండగానే వివాహం చేసుకున్న మొదటి పంజాబ్ సీఎంగా ఆయన నిలిచారు. ఈ పెళ్లికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ హాజరయ్యారు.
Read Also: Asaduddin Owaisi: ప్రధానిపై సెటైర్లు.. ఆయనంటే మోడీకి ఎందుకంత భయం?
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో నరీందర్ కౌర్ భరాజ్… పంజాబ్ రాజకీయ ప్రముఖుడు, మాజీ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా (కాంగ్రెస్)పై 36,430 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో పంజాబ్ అసెంబ్లీలో అంత్యంత చిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే. ఆమె సంగ్రూర్లోని భరాజ్ గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించారు. పట్టుదలతో లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. భరాజ్ భర్త.. మణ్‌దీప్ సింగ్‌ది కూడా ఓ రైతు కుటుంబమే. ఆయన భవానీగఢ్ ప్రాంతంలోని లాఖేవాల్ గ్రామానికి చెందిన వ్యక్తి. మణ్‌దీప్ గతంలో సంగ్రూర్ జిల్లా ఆప్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. అయితే వీరిద్దరూ చిన్నప్పటి నుంచే స్నేహితులు.