10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
- JBL భారత మార్కెట్లో Live Buds 4, Live Beam 4 TWS ఇయర్‌బడ్స్‌ను లాంచ్
- రెండు మోడళ్లలో 10mm డైనమిక్ డ్రైవర్లు, Hi-Res Audio, JBL Signature Sound
- True Adaptive Noise Cancelling (ANC) 2.0 టెక్నాలజీతో మెరుగైన నాయిస్ క్యాన్సలేషన్...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JBL Live Buds 4, Live Beam 4: భారత మార్కెట్లో JBL నుండి కొత్తగా ట్రూ వైర్లెస్ స్టీరియో (TWS) ఇయర్‌బడ్స్ JBL లైవ్ బడ్స్ 4 (JBL Live Buds 4), JBL లైవ్ బీమ్ 4 (JBL Live Beam 4)లను అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఈ రెండు మోడళ్లలో 10mm డైనమిక్ డ్రైవర్లు, ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సలింగ్ (ANC) 2.0, Hi-Res ఆడియో, JBL సిగ్నేచర్ సౌండ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇయర్‌బడ్స్ JBL ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Hi-Res ఆడియో:
రెండింటిలోనూ 10mm Dynamic Driversను అందించారు. అలాగే Hi-Res ఆడియో, JBL స్పటియాల్ సౌండ్, Personi-Fi 3.0, పర్సనల్ సౌండ్ ఆమ్ప్లిఫికేషన్, లో వాల్యూం EQ, JBL సిగ్నేచర్ సౌండ్ ట్యూనింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక డిజైన్ విషయానికి వస్తే.. Live బడ్స్ 4 సాధారణ ఇన్-ఇయర్ సిలికాన్ టిప్స్‌తో వస్తుండగా.. Live బీమ్ 4 స్టెమ్ డిజైన్‌తో ఇన్-ఇయర్ ఇయర్‌బడ్స్‌గా అందుబాటులోకి వచ్చింది.
Also Read
- TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
- iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
- Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
AI కాల్ క్వాలిటీ:
ఈ రెండు మోడళ్లలోనూ 4-మైక్ ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సలింగ్ 2.0 టెక్నాలజీ ఉంది. అయితే JBL లైవ్ బీమ్ 4లో అదనంగా స్మార్ట్ టాక్ విత్ అడాప్టివ్ ANC 2.0 ఫీచర్‌ను అందించారు. అలాగే రెండు మోడళ్లలో 6-మైక్రోఫోన్ పర్ఫెక్ట్ కాల్స్ 2.0, AI ఆధారిత కాల్ ఎక్వలైజర్, సౌండ్ లెవెల్ ఆప్టిమైజర్ వంటి ఫీచర్లు ఉండటంతో కాల్స్ మరింత స్పష్టంగా వినిపిస్తాయి. టచ్ కంట్రోల్స్‌ను కూడా వినియోగదారులు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.
బ్యాటరీ:
బ్యాటరీ పరంగా JBL Live Buds 4లో ANC ఆన్‌లో 32 గంటల వరకు, ANC ఆఫ్‌లో 40 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఇక JBL Live Beam 4లో ANC ఆన్‌లో 40 గంటల వరకు, ANC ఆఫ్‌లో 48 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందుతుందని JBL తెలిపింది. కేవలం 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ పొందవచ్చు. ఛార్జింగ్ కేస్ వైర్లెస్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.
Stay in the moment with sound that surrounds you. Stay true to yourself with colours that speak to you. Stay connected to your world with JBL Live Beam 4.
Get yours today – https://t.co/NXv6X097T3
[ JBL Live Beam 4, JBL Live Series, True Wireless Bluetooth Earbuds, JBL India ] pic.twitter.com/EdYb1qA4iK
— JBL India (@JBLSoundIn) August 6, 2026
ధర:
భారత మార్కెట్లో JBL లైవ్ బడ్స్ 4, JBL లైవ్ బీమ్ 4 ధర రూ. 24,999గా నిర్ణయించారు. JBL లైవ్ బడ్స్ 4 బ్లాక్, బ్లూ, సాండ్, సిల్వర్ రంగుల్లో లభిస్తుండగా, JBL లైవ్ బీమ్ 4 బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్, సాండ్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం JBL ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఆన్లైన్ రిటైల్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఈ రెండు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?