AAP MLA criticizes TRS party MLAs purchase case: బీజేపీ నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ లోటస్’ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బట్టబయలు చేశారని అన్నారు ఆప్ ఎమ్మెల్యే అతిషి సింగ్. బీజేపీలో చేరేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లను ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆఫర్ ఢిల్లీ సీఎం ముందుకు తీసుకువచ్చారని ఆమె అన్నారు. మొత్తం సీబీఐ, ఈడీ కేసులు మూసేస్తామని.. బీజేపీ నుంచి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆమె విమర్శించారు. మనీష్ సిసోడియాను సీబీఐ పిలిచిన సందర్భంలో కూడా ఇలాంటి ప్రతిపాదనే చేశారని అతిషి సింగ్ అన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో కూడా ఒక్కో ఎమ్మెల్యేను కొనేందుకు రూ. 25 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆపరేషన్ లోటస్ బట్టబయలైందని ఆన్నారు. బీజేపీ దళారులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. దళారుల నుంచి కోట్ల రూపాయలను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ముగ్గురు దళారులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోందని.. దళారుల ఆడియోలు కూడా బహిర్గతం అయ్యాయని ఎమ్మెల్యే అతిషి సింగ్ అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ. 100 కోట్ల నగదును తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. పైలెట్ రోహిత్ రెడ్డితో మాట్లాడిన ఆడియోలో అనేక అంశాలు ఉన్నాయని అన్నారు.
Read Also: Myositis: సమంతకు వచ్చిన ‘మయోసైటిస్’ వ్యాధి అంటే ఏమిటి? లక్షణాలు ఎలా ఉంటాయి?
పార్టీలో చేరితే డబ్బులు, పదవులు, సెక్యూరిటీ కల్పిస్తామని హమీ ఇస్తామని చెప్పారని.. సీబీఐ, ఈడీ కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని అన్నారని.. గతంలో వెస్ట్ బెంగాల్ లో సువేందు అధికారి బీజేపీలో చేరిన తర్వాతే ఈడీ, సీబీఐ కేసుల నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు. అలాగే మనీష్ సిసోడియాకు కూడా ఆఫర్ చేశారని విమర్శించారు. పార్టీలోకి ఎమ్మెల్యేలను తీసుకువస్తే బీఎల్ సంతోష్ తో మీటింగ్, నంబర్ 2తో మాట్లాడిస్తామని హామీ ఇచ్చారని.. కేంద్ర హోం శాఖ మంత్రి దేశంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పని మీద దృష్టి పెట్టారా..? అని ప్రశ్నించారు.
తెలంగాణలో చేసిన విధంగానే ఢిల్లీలో చేస్తున్నామని చెప్పారు.. ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీకి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఈడీ, సీబీఐ సోదాలు చేయాలని.. కేంద్ర హోం మంత్రిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణలో ఆపరేషన్ లోటస్ విఫలం అయిందని అన్నారు.