దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)లోని 12 వార్డుల్లో ఎన్నికలు జరగగా ఏడింటిని బీజేపీ గెలుచుకుంది.
BJP: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD)లో ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో రెండుసార్లు ఎమ్మెల్యే, పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజేష్ గుప్తా బీజేపీలో చేరారు. దీంతో,ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
Swati Maliwal: ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై శీష్ మహల్2.0 ఆరోపణలు వస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల ముందు ఆయన విలాసవంతమైన భవనం వివాదంగా మారింది. అయితే, ఇప్పుడు ఛండీగఢ్‌లో కూడా ఇలాంటి భవనాన్ని ప్రభుత్వం కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో స్పష్టంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా ఇండియా కూటమి గుర్తించింది. అనుకున్నదానికంటే జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓట్లు తక్కువ పడ్డాయి. దీంతో ప్రతిపక్ష ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లుగా హస్తం పార్టీ గుర్తించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీరును ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో భర్త మనీష్ గుప్తాను పక్కనే కూర్చోబెట్టుకోవడంపై విమర్శలు గుప్పించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ధ్వజమెత్తారు.
పంజాబ్‌లో ఓ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ పఠాన్మజ్రా వీరంగం సృష్టించారు. అత్యాచారం ఆరోపణలపై మంగళవారం ఉదయం కర్నాల్‌లో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా ఎమ్మెల్యే, అతని సహాయకులు పోలీసులు కాల్పులు జరిపారు.
దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. బుధవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి రహదారులన్నీ చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధికారిక నివాసం దేశ రాజధానిలోని రాజ్ నివాస్ మార్గ్‌లో కేటాయించబడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక... ఇన్ని రోజులకు అధికారిక నివాసం కేటాయించబడింది. ప్రస్తుతం సొంత నియోజకవర్గం షాలిమార్ బాగ్‌లో తన ఇంట్లో నివాసం ఉంటున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అతిషి నియోజకవర్గమైన కల్కాజీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. గోవింద్‌పురి జుగ్గి క్లస్టర్లో ఉన్న 1,200కు పైగా అక్రమ గుడిసెలను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు.