ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్దకు ఉదయం 11.00 గంటలకు మనీష్ సిసోడియా చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులను ఎందుకు కలిశారని ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
గుజరాత్‌పై మార్పు తుఫాన్ దూసుకుపోతోందని. తమ పార్టీ తదుపరి ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
AAP MLA : పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే నరీందర్ కౌర్ ఆ పార్టీ కార్యకర్త అయిన మణ్‌దీప్‌ను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి పటియాలాలోని రోరేవాల్ గ్రామంలోని ఓ గురుద్వారాలో జరిగింది.
Kejriwal: గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా చివరకు గెలిచేది ఆమ్ ఆద్మీ పార్టీనేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
Punjab Politics- Governor vs CM: పంజాబ్ రాష్ట్రంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మధ్య వివాదం చెలరేగుతోంది. బలపరీక్ష నిర్వహించి సభలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం భగవంత్ మాన్ అనుకున్నప్పటి నుంచి గవర్నర్, సీఎంల మధ్య వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే తాజాగా భగవంత్ మాన్ కోరిన మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చారు. ‘‘చాలా దయ’’తో గవర్నర్ మా అభ్యర్థనను అంగీకరించారని.. స్పీకర్ కల్తార్ సింగ్ సంధ్వన్ ట్వీట్…
Gujarat AAP leader arrested for raping: ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి బీజేపీ గుజరాత్ లో గెలుపొందాలని భావిస్తోంది. 2024 ఎన్నికల ముందు సెమిఫైనల్స్ గా ఎన్నికలను భావిస్తోంది. ఇదిలా ఉంటే పంజాబ్ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న ఉత్సాహంతో గుజరాత్ లో కూడా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆప్ నేతలు మాత్రం పలు కేసుల్లో ఇరుక్కుంటుండం ఆ పార్టీకి మింగుడపడటం లేదు.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది. ఈ స్కామ్ లో ముడపుల విషయంలో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో ఉన్న కంపెనీలకు హైదరాబాద్ కంపెనీల నుండి భారీగా ముడుపులు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయి. శ్రీనివాసరావుకు చెందిన పలు కంపెనీల నుంచే ముడుపులు వెళ్లినట్లు ఆధారాలను ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ లిక్కర్ స్కామ్ కేసులో…
వరుసగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి.. తమ సర్కార్‌ను భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తూ వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.. ఇక, ఈ మధ్య, మరో రెండు మూడు రాష్ట్రాల్లో పరిస్థితులను ముందుగానే ఆ రాష్ట్రాల సీఎంలు పసిగట్టి.. వారికి చెక్ పెట్టే విధంగా ఫ్లోర్ టెస్ట్ కూడా నిర్వహించారు.. అందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒకరైతే.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మరొకరు.. అయితే, ఆ రాష్ట్రాల్లో తమ ఎత్తులో చిత్తు కావడంతో..…
Congress is finished in Gujarat, says Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన అహ్మదాబాద్ నగరంలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం అయిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీతో అమీతుమీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే ఆప్ నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని గుజరాత్‌లో హామీల వర్షం గుప్పించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో గుజరాత్ పలు హామీలను గుప్పించారు.