Zelensky: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తాజాగా కీవ్‌పై మాస్కో ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. దీనిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్స్కీ చేసిన పోస్ట్‌లో.. ఈ దాడిపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేయడానికి పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. రష్యా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి మా ప్రాంతంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన నిప్రోను ఢీ కొట్టిందని ఆయన వెల్లడించారు. మాతో యుద్ధానికి నార్త్ కొరియా నుంచి 11వేల మంది సైనికులను తీసుకురావడంతో పాటు మాపై క్షిపణితో దాడి చేశారని జెలెన్ స్కీ ఆరోపించారు.
Read Also: President Droupadi Murmu: దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం..
కాగా, ఈ యుద్ధాన్ని మరింత విస్తరించొద్దని ప్రపంచ దేశాధినేతలు పిలుపునిస్తున్నా కూడా వ్లాదిమిర్ పుతిన్ పట్టించుకోవడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నాడు. తాజా దాడితో రష్యాకు శాంతి చర్యలపై ఇంట్రెస్ట్ లేదనే విషయంలో క్లారిటి వచ్చింది. ఈ అంశంపై ప్రపంచ దేశాలు తక్షణమే రియాక్ట్ కావాలని జెలెన్స్కీ రాసుకొచ్చారు.
Read Also: Nitish Reddy: నితీశ్ రెడ్డి లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ ఇదే.. తండ్రి భావోద్వేగం!
అయితే, ఉక్రెయిన్‌కు తాము అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై వినియోగించుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. దీనిపై రష్యా తీవ్రంగా మండిపడింది. అణ్వస్త్ర ప్రయోగానికి మార్గం సుగమం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది మాస్కో. అలాగే, అవసరమైతే ఇతర దేశాలపైనా ఆ తరహా ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తామని హెచ్చరించాడు. అదే సమయంలో ఉక్రెయిన్ దళాలు రష్యా ప్రధాన భూభాగంపై క్షిపణులతో దాడి చేయగా.. దీనికి ప్రతీకారంగా మాస్కో దాడి చేసే ఛాన్స్ ఉందనే భయంతో కీవ్‌లోని యూఎస్ రాయబారి కార్యాలయాన్ని ఖాళీ చేసింది.
Today, Putin admitted to taking a second step this year toward escalating and expanding this war. A new ballistic missile was used. Putin struck our city of Dnipro, one of Ukraine’s largest cities. This is a clear and severe escalation in the scale and brutality of this war—a…
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) November 21, 2024