Pakistan: పాకిస్తాన్, అంతర్జాతీయ పరువు పోగొట్టుకోవడం అనవాయితీగా మార్చుకుంది. ఆ దేశం నుంచి ప్రధానితో పాటు ఎవరూ విదేశాలకు వెళ్లిన అంతర్జాతీయ అవమానం ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా, తుర్క్మెనిస్తాన్లో జరిగిన ఓ సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అమెరికా 28 పాయింట్ల ప్రణాళికను రూపొందించారు. దీనిపై ఇప్పటికే ట్రంప్ బృందం ఇరు దేశాలతో చర్చించాయి. 28 పాయింట్ల ప్రణాళికకు రష్యా అంగీకారం తెలిపింది.
ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిగాయి. అనంతరం అలాస్కా వేదికగా పుతిన్‌తో స్వయంగా ట్రంప్ చర్చలు జరిపారు.
ఢిల్లీలో పుతిన్ పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ హౌస్‌లో పుతిన్-మోడీ ద్వైపాక్షిక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం గురించి మోడీ ప్రస్తావించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం తటస్థంగా లేదని.. భారత్ ఎల్లప్పుడూ శాంతి వైపే ఉంటుందని తేల్చి చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ శాంతి మార్గంలోకి రావాలని వస్తాయని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ వ్యాఖ్యానించారు. అయినా ఈ కాలం యుద్ధం యుగం కాదని తెలిపారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. ఉదయం రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని పుతిన్ స్వీకరించారు. అక్కడ నుంచి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోడీ స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నాక ఒకే కారులో ప్రయాణం చేశారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోడీ స్వయంగా వెళ్లి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఒకే కారులో ప్రయాణం చేశారు.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా పుతిన్ భారత్ పర్యటకు వచ్చారు. భారత్, రష్యాల మధ్య మరిన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో పలు ఒప్పందాలపై చర్చలు జరుగుతాయి. ఇదిలా ఉంటే, ఇండియా టుడే పుతిన్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా వైఖరి, వెస్ట్రన్ దేశాల నైజాన్ని ఎండగట్టారు.
Modi-putin: రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరికాసేపట్లో భారత్‌లో ల్యాండ్ కాబోతున్నారు. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్ పర్యటించనున్నారు. ఇప్పటికే, భారత ప్రభుత్వం పర్యటన కోసం అత్యున్నత ఏర్పాట్లను చేసింది. పుతిన్ రాకతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పుతిన్ బస చేసే హోటల్, సందర్శించే ప్రాంతాలను భారత భద్రతా అధికారులతో పాటు రష్యన్ సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈరోజు భారత్‌కు రానున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.