Nitish Reddy: నితీశ్ రెడ్డి లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ ఇదే.. తండ్రి భావోద్వేగం!
- పెర్త్ వేదికగా తొలి టెస్టు
- టీమిండియా తరఫున ఇద్దరు అరంగేట్రం
- నితీశ్ లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. ఈ టెస్టులో టీమిండియా తరఫున ఇద్దరు అరంగేట్రం చేశారు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు తుది జట్టులో స్థానం దక్కింది. ఇప్పటికే టీ20ల్లో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు నితీశ్… పెర్త్ టెస్ట్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నితీశ్ టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు.
విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నితీశ్ రెడ్డి టెస్టు క్యాప్‌ను అందుకోవడంతో అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఆనందం వ్యక్తం చేశాడు. తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ చేతుల మీదుగా టెస్టు క్యాప్‌ను అందుకోవడం నితీశ్ లైఫ్‌లో అత్యుత్తమ క్షణాలని చెప్పారు. ‘టెస్టుల్లో అరంగేట్ర సమయంలో విరాట్ కోహ్లీతో టీమిండియా క్యాప్ అందుకోవాలని నితీశ్ ఎప్పటి నుంచో కలలు కన్నాడు. ఆ కల నేడు నెరవేరింది. నితీశ్ లైఫ్‌లో అత్యుత్తమ క్షణం ఇదే. ఓ తండ్రిగా నేను ఎంతో ఆనందంగా ఉన్నా. ఈ ఏడాది నితీశ్‌కు గొప్పగా కలిసొచ్చింది. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ అదరగొట్టాడు. దాంతో బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాపై ఆడుతున్నాడు. కోహ్లీతో కలిసి నితీశ్ ఆడుతుండడం ఆనందంగా ఉంది’ అని ముత్యాల రెడ్డి చెప్పారు.
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
Also Read: Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’లో 14వ రోజు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
పెర్త్ టెస్టులో నితీశ్ రెడ్డి అదరగొడుతున్నాడు. ఆరు వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును నితీశ్ ఆదుకున్నాడు. రిషబ్ పంత్‌తో కలిసి జట్టు స్కోరును 100 దాటించాడు. 47 బంతుల్లో 27 రన్స్ చేశాడు. మరోవైపు పంత్ 37 రన్స్ చేసాడు. భారత్ 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు