BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓటుకు నోటు’’.. కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు..
- మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓటుకు నోటు’’..
- కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన బీజేపీ నేత..
- రాహుల్ గాంధీ, ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్..
- లేకపోతే పరువునష్టం కేసు ఎదుర్కోవాలన్న వినోద్ తావ్డే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వినోద్ తావ్డే, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సుప్రియా శ్రీనాట్, రాహుల్ గాంధీలకు లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్‌లోని ఓ హోటల్‌లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేత రూ.5 కోట్లు పంపిణీ చేశారని బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) నాయకుడు హితేంద్ర ఠాకూర్ మంగళవారం ఆరోపించిన నేపథ్యంలో తావ్డే లీగల్ నోటీసు వచ్చింది.
తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడువని, నిరాధారమైనవని, దుష్ర్పవర్తనతో చేసినవని తావ్డే నోటీసుల్లో పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో తనపై ఆరోపణలు చేసిన ముగ్గురు కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు, ఒక హోటల్‌లో చొరబడిన బీవీఏ కార్యకర్తలు అక్కడే ఉన్న తావ్డే రూ. 5 కోట్లతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడనే వీడియోని పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్‌గా మారింది. హోటల్ గదుల నుంచి రూ. 9.93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి మంగళవారం తెలిపారు.
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- Jaishankar: జైశంకర్ మళ్లీ వేసేశాడు.. పాక్ జర్నలిస్ట్‌కు ఘాటు కౌంటర్!
- High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తావ్డే ఈ ఆరోపణల్ని ఖండించారు. తాను ఎన్నికల విధానాలపై పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకత్వం మాత్రమే అందిస్తున్నానని, ప్రత్యర్థి హోటల్‌లో డబ్బు పంపినీ చేసేంత తెలివితక్కువ వాడిని కాదని అన్నారు. వివంతా హోటల్ ఠాకూర్‌లకు చెందినదని, వారి హోటల్‌కి వెళ్లి అక్కడ డబ్బు పంచేంత మూర్ఖుడిని కాదనని తావ్డే మీడియా సమావేశంలో అన్నారు. ఈ వివాదానికి సంబంధించి పోలీసులు మంగళవారం తావ్డే, బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్ తదితరులపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. తావ్డేపై ఎన్నికల సంఘం మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!