IRCTC Punya Kshetra Yatra: మీరు లేదా ఇంట్లోని మీ తల్లిదండ్రులు లేదా పెద్దలను తీర్థయాత్రలను సందర్శించడానికి తీసుకెళ్లాలనుకుంటే ఇది మీకు గొప్ప అవకాశం అని అనుకోవచ్చు. ఇందుకు సంబంధించి తాజాగా, ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో మీరు ఒకేసారి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ పేరు ‘పుణ్య క్షేత్ర యాత్ర’. ఈ ప్యాకేజీలో మీ వసతి, ఆహారం ఇంకా ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉంటాయి. పూర్తి ప్యాకేజీ వివరాలను ఒకసారి చూస్తే..
Also Read: Home Remedies For Cold: ఈ ఆయుర్వేద పద్ధతులను ఉపయోగించి జలుబు నుండి తక్షణ ఉపశమనాన్ని పొందండి ఇలా
ఈ ట్రిప్ ప్యాకేజీలో మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లు ఉంటుంది. ఈ యాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది. ఇక ప్యాకేజీని బుక్ చేయడానికి ఎంత ఖర్చవుతుందన్న విషయానికి వస్తే.. స్లీపర్ క్లాస్ లో టికెట్ బుక్ చేసుకుంటే రూ.16,800 అవుతుంది. అదే 3వ ఏసీ (3 AC)లో టికెట్ బుకింగ్ ధర రూ.26,650, 2వ ఏసీ (2 AC)లో టికెట్ బుకింగ్ ధర రూ.34,910. ఈ ప్యాకేజీ డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ టూర్ లో పూరి, కోనార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ లను సందర్శించవచ్చు.
Also Read: Russia-Ukraine War: రాజుకున్న యుద్ధం.. ఉక్రెయిన్‌పై అణు రహిత క్షిపణి ప్రయోగం
ఈ టూర్ లో పూరిలోని జగన్నాథ ఆలయం, కోణార్క్ లోని సూర్య దేవాలయం, గయలోని విష్ణుపాద దేవాలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయాలు, ఇంకా సాయంత్రం గంగా హారతి, అలాగే అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్‌గర్హి, సరయూ నది వద్ద హారతి, చివరగా.. ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం సందర్శిస్తారు. ఇకపోతే, మీరు యాత్ర ప్రారంభానికి 15 రోజుల ముందు మీ టిక్కెట్‌ను రద్దు చేస్తే.. ప్యాకేజీ ఛార్జీ నుండి రూ. 250 తీసివేయబడుతుంది. అదే టూర్ ప్రారంభానికి 8 – 14 రోజుల మధ్య టికెట్ రద్దు చేయబడితే 25% తీసివేయబడుతుంది. అలాగే టూర్ ప్రారంభానికి 4 – 7 రోజుల ముందు టికెట్ రద్దు చేయబడితే 50 శాతం కోత పడుతుంది. యాత్ర ప్రారంభానికి 4 రోజుల ముందు ప్యాకేజీని రద్దు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా రాదు. పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG33 సందర్శించండి.
Wander through the iconic sacred destinations with IRCTC’s 9N/10D Ayodhya – Kashi: Punya Kshetra Yatra.
Book Now: https://t.co/ApiniJyaz2
(Package Code = SCZBG33)#IRCTCForYou #ThinkTravelThinkIRCTC #IRCTCAt25 #DekhoApnaDesh pic.twitter.com/8qdDqlfYPO
— IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) November 18, 2024