అమెరికాలోని కాలిఫోర్నియా బీచ్‌లో ఒక అరుదైన చేపను రీసెర్చ్ స్కాలర్ కనుగొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పీహెచ్‌డీ అభ్యర్థి షేర్ చేశాడు. ‘ఓర్‌ఫిష్’ లేదా ‘డూమ్స్‌డే ఫిష్’గా పిలిచే ఈ చేప చాలా అరుదైందిగా పేర్కొన్నాడు. ఈ చేప కనిపిస్తే.. సునామీ వచ్చినట్లేనా? లేదంటే భూకంపం వచ్చినట్లేనా? ఇంతగా మూడనమ్మకం ప్రబలడానికి కారణమేంటి? అసలు ఆ చేప వింతేంటి? అంత ప్రత్యేకత సాధించడానికి గల కారణాలేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
స్క్రిప్స్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీలో చదువుతున్న పీహెచ్‌డీ విద్యార్థి అలిసన్ లాఫెరియర్.. కాలిఫోర్నియాలోని ఎన్‌సీనిటాస్‌లోని గ్రాండ్‌వ్యూ బీచ్‌లో కుక్కతో తిరుగుతున్నాడు. అలా తిరుగుతుండగా బీచ్ ఒడ్డున రాళ్ల గుట్టలో ఒక భారీ చేప కనిపించింది. దాని దగ్గరకు వెళ్లి పరిశీలించగా అది ఓర్‌ఫిష్ లేదా డూమ్స్‌డే షిప్‌గా గుర్తించాడు. ఈ అరుదైన చేప చాలా చల్లని జీవి అని.. దీని పొడవు దాదాపు 9 నుంచి 10 అడుగుల పొడవు ఉంటుందని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను దాని వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ జీవి సముద్ర అడుగు భాగంలో సంచరిస్తుందని వెల్లడించాడు. ఈ చేపలు అరుదుగా ఉంటాయని.. మరోసారి ఈ విధంగా గుర్తించబడిందని పోస్టులో రాసుకొచ్చాడు. పరిశోధన కోసం నైరుతి ఫిషరీస్ సైన్స్ సెంటర్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: Koti Deepotsavam 2024 Day 14 LIVE: మధురై మీనాక్షి కల్యాణోత్సవం.. కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన
చేప యొక్క నమూనాలను సేకరించినట్లు ఫిషరీస్ సైన్స్ సెంటర్ శాస్త్రవేత్తల తెలిపారు. దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తదుపరి సంక్షరణ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఓర్‌ఫిష్ జాతుల పెరుగుదలపై రీసెర్చ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఓర్ ఫిష్ పొడవాటి ఈల్ లాంటి శరీరం కలిగి ఉంటుంది. అలాగే ప్రకాశవంతమైన ఎరుపు డోర్సల్ రెక్కలు ఉంటాయి. గ్యాపింగ్ నోరుతో విభిన్నంగా ఉంటుంది. ఇది ఒక లోతైన సముద్ర జీవి. ఇది శాస్త్రీయ మరియు ప్రసిద్ధ ఊహలను రెండింటినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ చేపను రాబోయే విప్తత్తుకు సూచనగా.. ముఖ్యంగా భూకంపాలకు సూచనగా గుర్తిస్తారని.. జపనీస్ జానపద కథల్లో ఈ విధంగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 2011 భూకంపానికి ముందు జపాన్ తీరంలో ఓర్ ఫిష్ కనుగొన్న తర్వాత ఈ మూఢనమ్మకం మరింత వ్యాప్తి చెందింది. ఇది ప్రకృతి వైపరీత్యాలకు సూచనగా ఉందని ఒక మూడ నమ్మకం బాగా వ్యాప్తిచెందింది. అంతే కాకుండా ఆయా సమయాల్లో ఈ చేప వివిధ రూపాలను కూడా మార్చుకుంటుందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: AV Ranganath : కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు.. ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదు
Look what decided to make another appearance! 🌊 Last week, another #oarfish washed up on Grandview Beach in Encinitas and was spotted by Scripps Oceanography PhD candidate Alison Laferriere. This cool creature measures roughly 9 to 10 feet long. pic.twitter.com/gJjc9BBLwc
— Scripps Institution of Oceanography (@Scripps_Ocean) November 13, 2024