ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేసింది. అలాగే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 373గా రికార్ట్ అయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లలో తొమ్మిదింటిలో ఏక్యూఐ లెవల్స్ తీవ్రమైన కేటగిరీలో ఉన్నట్లు తేలింది.
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన..
విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై శాససనమండలి ప్రశ్నోత్తరాల్లో సమాధానం ఇచ్చిన మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళిక కేంద్రానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తాం అని స్పష్టం చేశారు.. ఇక, వంద శాతం కేంద్రమే నిధులు భరించేలా నిర్మాణం చేపట్టాలని కోరామని వెల్లడించారు.. మొదటి ఫేజ్ లో 46.2 కిలోమీటర్లతో మూడు కారిడార్ల నిర్మాణం జరగనుందన్న ఆయన.. మొదటి ఫేజ్ లో స్థానిక ఎమ్మెల్యేలు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు.. ఈ కారిడార్స్ లో హనుమంతు వాక, మద్దెలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కయ్యపాలెం ప్రాంతాలలో 14 జంక్షన్లు ఉన్నాయని తెలిపారు.. ఈ ప్రాంతాలలో 8 మీటర్ల ఫ్లై ఓవర్, దానిపైన మెట్రో నిర్మాణం చేయమని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు డీపీఆర్ చేయాలని నిర్ణయించామని శాసనమండలిలో ప్రకటించారు మంత్రి పొంగూరు నారాయణ.
‘రేవారీ పర్ చర్చా’ పేరుతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ సీఎం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరుపున ‘రేవారి పే చర్చా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆరుగురు రేవాడీలను ప్రస్తావించారు. దీంతో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఢిల్లీకి వస్తే కరెంటు, నీళ్ల బిల్లులు కట్టాల్సిందేనని కేజ్రీవాల్ అన్నారు. 20 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు కరెంటు లేదని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కరెంటు కోత లేదని కేజ్రీవాల్ అన్నారు. ఈ 20 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదని అన్నారు.
సీఎంకు నల్లజెండా చూపించడం చట్ట విరుద్ధం కాదు..
వామపక్ష సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. 2017లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కాన్వాయ్‌లో వెళ్తుండగా నల్లజెండాలు ప్రదర్శించిన ముగ్గురు వ్యక్తులపై అభియోగాలను కేరళ హైకోర్టు రద్దు చేసింది. ఇండియన్ యాక్ట్ ప్రకారం ఇలాంటి చర్యలు పరువు నష్టం లేదా చట్ట విరుద్ధమైనవి కాదని కాదని జస్టిస్ బెచు కురియన్ థామస్ తీర్పు ఇచ్చారు. అయితే, 2017 ఏప్రిల్ 9న సీఎం కాన్వాయ్ ఉత్తర పరవూరు మీదుగా వెళుతుండగా సిమిల్, ఫిజో, సుమేష్ దయానందన్ నల్లజెండాలు ప్రదర్శించడంతో ఈ కేసు నమోదు అయింది. ఈ ముగ్గురిపై తొలుత పరువు నష్టం, ప్రజా మార్గాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వ ఉద్యోగులకు హాని కలిగించడం లాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి.. స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పెంపు..
స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పెంపుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా శుభావార్త చెప్పారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. స్పోర్ట్స్ కో రిజర్వేషన్ 2 శాతం నుండి 3 శాతానికి పెంచనున్నట్టు వెల్లడించారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో 2047 విజన్ తో గ్లోబల్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం మారుతుందని తెలిపారు.. స్పోర్ట్స్ కోటాలో 2 శాతం నుండి 3 శాతానికి రిజర్వేషన్ పెంచుతాం.. ఒలంపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన వారికి ఉద్యోగ అవకాశాల అర్హత కల్పిస్తామని పేర్కొన్నారు.. శాప్ లో గ్రేడ్ -3 కోచ్ ల కోసం అంతర్జాతీయంగా పథకాలు సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ ఉంటుందన్నారు.. పారా స్పోర్ట్స్ తో పాటు Deaf స్పోర్ట్స్, Blind స్పోర్ట్స్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్స్ జార చేయనున్నట్టు తెలిపారు.
అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం.. పవన్‌ను ఆలింగనం చేసుకున్న బొత్స..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న వేళ.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. మండలి వేదికగా నిన్నటి రోజున హాట్ కామెంట్లు చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఈ రోజు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఎదురుగా వెళ్లి పవన్‌ను పలకరించారు.. పవన్ కల్యాణ్ తనవైపు వస్తుండటం చూసి ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు బొత్స.. మరోవైపు పవన్ వస్తుండడాన్ని చూసి పక్కకు వెళ్లిపోయారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు.
ఎగ్జిట్ పోల్స్ తారుమారు.. గెలిచేది కాంగ్రెస్ పార్టీనే..
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపటితో ఈ రెండు రాష్ట్రాల్లో విజయం సాధించేది ఎవరో తేలనుంది. అయితే, దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు మాత్రం రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమినే అధికారం చేపడుతుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూటమి మాత్రం అధికారం తామదే అని ధీమా వ్యక్తం చేస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్ని తప్పని రుజువు అవుతుందని కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కర్ణాటక రాష్ట్ర పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఉత్తర కన్నడ జిల్లాలోని మురుడేశ్వర దేవాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన శివకుమార్.. తప్పకుండా గెలుస్తాం. ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారవుతాయని అన్నారు. “నేను మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రచారం నిర్వహించాను. అక్కడ తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం ఉంది. మహారాష్ట్రలో స్వల్ప తేడాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. ఆయన నేతలందరితో కూడా మాట్లాడారు, నేను కూడా మహారాష్ట్రకు వెళ్లాను. పార్టీకి అంతా అనుకూలంగా, సజావుగా సాగుతున్నట్లు నేను చూశాను’’ అని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి
కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ (కేంద్ర విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ) సమావేశానికి స్థానిక ఎంపీ రఘువీర్ రెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాల పెంపు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. కేంద్ర పథకాల అమలుకు సంబంధించి తన ఎంపీ అనుభవాలను సభ్యులతో పంచుకుంటూ, వాటిని ఎఫెక్టివ్‌గా అమలు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.
వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ‘స్వర్ణాంధ్ర 2047’ డాక్యుమెంట్ రూపొందించాం..
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర – 2047’ డాక్యుమెంట్‌పై మాట్లాడారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ‘స్వర్ణాంధ్ర 2047’ డాక్యుమెంట్ రూపొందించామని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం తెలిపారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది.. ప్రధాని మోదీ వికసిత్ భారత్ పిలుపునిచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మనం స్వర్ణాంధ్ర – 2047తో ముందుకెళ్లాలి.. నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలన్నారు. 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపర్చాలని చెప్పారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది.. ప్రజల కోసం పని చేస్తే ప్రజలే ఎన్నుకుంటారని సీఎం చంద్రబాబు తెలిపారు.
హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉంది
ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉందని ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడిందని, అనర్హత పైన సర్వాధికారులు స్పీకర్ కు ఉన్నాయని కోర్టు తేల్చిందన్నారు ఆది శ్రీనివాస్. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే న్యాయస్థానం సూచించిందని, నిర్ణీత సమయాన్ని కూడా కోర్టు ప్రస్తావించలేదని ఆయన తెలిపారు. అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారని, రాజ్యాంగం ప్రకారం సభాపతి నడుచుకుంటారన్నారు ఆది శ్రీనివాస్. కోర్టు తీర్పు రాకుండానే గతంలో కేటీఆర్ ఈ విషయంలో ఎగిరెగిరి పడ్డారని, అప్పుడే ఉప ఎన్నికలు వచ్చినట్లు గా హడావిడి చేశాడని ఆయన మండిపడ్డారు. చేసిన పాపం గోచిలో పెట్టుకొని కాశీ కి పోయినట్లు కేటీఆర్, బీఆర్ఎస్ నేతల తీరు ఉంది అని ఆయన హెద్దెవ చేశారు. 10 యేళ్ల పాటు రాజ్యాంగాన్ని అపహస్యం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన 60 మంది కి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లను బీఆర్ఎస్ చేర్చుకుందన్నారు ఆది శ్రీనివాస్.