Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసినట్లు క్రెమ్లిన్ ఆరోపించింది. నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ ఇంటిపై ఈ దాడి జరిగినట్లు రష్యా ఆరోపించింది. అయితే, ఆ సమయంలో పుతిన్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని రష్యన్ అధికారులు బయటపెట్టలేదు. బుధవారం రక్షణ మంత్రిత్వ శాఖ దాడికి పాల్పడిన, కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ వీడియోను విడుదల చేసింది. Read Also: Mollywood 2025: నెవ్వర్ బిఫోర్ హైస్.. 96 ఏళ్ల మాలీవుడ్ చరిత్రను…
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చిగురిస్తున్న వేళ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు తీవ్ర కలకలం రేపాయి. సోమవారం అర్ధరాత్రి పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులు జరిగాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సంబంధించిన ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుతిన్ ‘శాంతాక్లాజ్’ వేషధారణలో ఆయా దేశాధినేతలకు గిఫ్ట్‌లు పంపించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు మార్గం సుగమం అవుతోంది. నాలుగేళ్ల నుంచి రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. చాలా రోజుల నుంచి విఫలమవుతున్న చర్చలు.. మొత్తానికి ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని యుద్ధాలు సద్దుమణిగాయి. కానీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం మాత్రం 4 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది.
సెలబ్రిటీలు వెరైటీగా స్నేహితులకు ప్రపోజ్ చేయడం చూస్తుంటాం. క్రీడాకారులైతే స్టేడియంలో.. సినీ నటులైతే వేదికలపై తమ మనసులోని అభిప్రాయాన్ని చెబుతుంటారు. ఇలాంటి వీడియోలు ఎన్నో వచ్చాయి. తాజాగా రష్యాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే రోజులు దగ్గర పడ్డాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం మాత్రం ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.
Shahbaz Sharif: తుర్క్మెనిస్తాన్ వేదికగా జరుగున్న ఓ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ జరగాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో పుతిన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ఉన్నారు. సుమారు 40 నిమిషాలు వేచి చూసినా కూడా పుతిన్ పట్టించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన షహబాజ్ షరీఫ్ దౌత్యంపరంగా సిగ్గులేని పని చేశాడు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అమెరికా 28 పాయింట్ల ప్రణాళికను రూపొందించారు. దీనిపై ఇప్పటికే ట్రంప్ బృందం ఇరు దేశాలతో చర్చించాయి. 28 పాయింట్ల ప్రణాళికకు రష్యా అంగీకారం తెలిపింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ముందడుగు పడడం లేదు. ఇటీవల 28 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ముందుకు తీసుకొచ్చారు. ఇక ట్రంప్ బృందం రంగంలోకి దిగి ఇరు దేశాలతో చర్చించారు.