తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణను సిట్ ప్రారంభించింది. ఉదయం తిరుపతికి సిట్ బృందం చేరుకుంది. నలుగురు డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో కలిసి సిట్ బృందం తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది. ఈ క్రమంలో.. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో తాత్కాలిక ఆఫీస్ ఏర్పాటు చేశారు. కల్తీ నెయ్యి కేసుపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి సీబీఐ డైరెక్టర్‌కు నివేదికను ఇవ్వనుంది ఈ బృందం. డీస్పీలు సీతా రామాంజనేయులు, శివ నారాయణ స్వామి, కృష్ణమోహన్, వెంకట్రామయ్యల పోలీసు అధికారుల బృందం తిరుపతి, తిరుమల, AR డైరీలలో విచారణ చేయనున్నారు.
నాలుగు బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి వ్యవహారం పై విచారణ చేపట్టనుంది సిట్. గత టీటీడీ బోర్డ్ దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై లోతుగా దర్యాప్తు చేయనుంది. నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను తమిళనాడులోని దుండిగల్ వెళ్లి ఓ బృందం దర్యాప్తు చేయనుంది. మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించడంతో పాటు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను సిట్ ప్రశ్నించనుంది. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది.
Read Also: Perni Nani: ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు.. నాలుగుసార్లు సీఎంగా పనిచేసి కూడా..!