Off The Record: చిత్తం చెప్పుల మీద- భక్తి భగవంతుడి మీద అన్నట్టుగా ఉంది తెలంగాణలో కొంత మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి. జంప్ అయిన పార్టీలో ఉండలేక, పాత పార్టీలోకి తిరిగి వెళ్ళలేక కుమిలిపోతున్నారట. వాళ్ళ పని మింగలేక-కక్కలేక అన్నట్టుగా మారిందని అంటున్నారు. అసలెందుకలాంటి పరిస్థితి వచ్చింది? ఆ పది మంది విషయంలో ఏం జరుగుతోంది?.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మొత్తం పది మంది ఎమ్మెల్యేలు జంప్ అవగా… అందులో ఓ ముగ్గురి పరిస్థితి మింగలేక- కక్కలేక అన్నట్టుగా ఉందట. వచ్చిన పార్టీలో ఇమడలేక పోతున్నారు. పోనీ… తిరిగి వెళదామా అంటే… సవాలక్ష సాంకేతిక సమస్యలు. అధికార పార్టీలో అయితే…. అన్ని విధాలా హాయిగా ఉంటుందని జంప్ కొట్టినా ప్రశాంతత లేకుండా పోయిందని వాపోతున్నట్టు సమాచారం. పాత కాంగ్రెస్ నేతలతో నియోజకవర్గాల్లో తలనొప్పుల కారణంగా… అక్కడ ఉండలేక తిరిగి బీఆర్‌ఎస్ మీద మనసు పారేసుకుంటూ కలకలం సృష్టిస్తున్నారు. అయితే… అలాంటి వాళ్ళకు చెక్ పెట్టేందుకు మంచి ఔషదాన్నే తయారు చేసి పెట్టుకుందట కాంగ్రెస్. ఉంటే ఉంటారు.. లేకపోతే ఏం చేయాలో తెలుసు. మా దగ్గర మంచి ఆయుధమే ఉందంటోంది అధికార పార్టీ. పటాన్‌చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గద్వాల ఎంఎల్ఏ కృష్ణమోహన్ రెడ్డిలే.. ఎక్కువ హడావుడి చేస్తున్నారు.
Read Also: Off The Record: BRS హయాంలో కీలకంగా ఉన్న వాళ్ళు తిరిగి అవే స్థానాలకు?
అయితే, మహిపాల్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ ఫోటో తీసేదే లేదంటున్నారు. పైగా ఇప్పుడు తానున్న పార్టీ మీదే అప్పుడప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నారు. సందర్భం చేసుకుని మరీ…కేసీఆర్‌ను కలుస్తున్నారట. అలా.. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో జాయిన్ అయినప్పటికీ మనసంతా గులాబీ తోటలోనే ఉందనేది స్పష్టం అంటున్నారు పరిశీలకులు. ఇక గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అక్కడ నియోజకవర్గ గొడవలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. గద్వాలలో కాంగ్రెస్ నేత సరితకు కృష్ణమోహన్‌రెడ్డికి క్షణం పడడంలేదు. దీంతో ఆయన విసుగుచెంది ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి తాను పార్టీ మారినట్లు దుష్ర్పచారం చేస్తున్నారంటూ ఎఫ్ఐఆర్ కూడా చేయించారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒకసారి కేటీఆర్‌ను పొగుడుతారు. మరోసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రాను విమర్శిస్తారు. ఈ కార్ రేస్ బెటర్ అంటారు. ఇలా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అనుమానస్పదంగా కనిపిస్తున్నారట.దాంతో ఈ ముగ్గురు తిరిగి…బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారనే రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. ఐతే అది అంత ఈజీ గా అయ్యే పనేనా..? అన్నది ఇక్కడ క్వశ్చన్. సుప్రీంకోర్టు అనర్హత వేటు నుండి తప్పించుకోవాలని తొందర పడితే…అసలుకే ఎసరొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ లో చెప్పిన పనులు కావడం లేదు… ఇక్కడ పరిస్థితి బాగోలేదు అంటూ పటాన్‌చెరు ఎంఎల్ఏ సొంత వారి దగ్గర కామెంట్స్ చేయడం, కాంగ్రెస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం లాంటి అంశాలు ఆయన తిరిగి గులాబీ గూటికి చేరతారన్న వాదనకి బలం చేకూరుస్తోందని అంటున్నారు.
Read Also: Pak train hijack: వందలాది ‘‘శవపేటికలు’’ సిద్ధం చేస్తున్న పాకిస్తాన్.. క్వెట్టాకు తరలింపు..
అలాగే, అటు కృష్ణమోహన్ రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇవే తిరిగి సొంత గూటికి వెళతారన్న వాదనకి బలం చేకూరుస్తున్నాయి. అయితే…. స్పీకర్ దగ్గర ఇప్పటికే వీళ్ళ అనర్హత పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. వాటిపై నిర్ణయం స్పీకర్ పరిధిలోనే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే… సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడానికంటే ముందే స్పీకర్ ఆ ముగ్గురిపై వేటు వేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. పైగా కాంగ్రెస్ ఇలాంటి వ్యూహాలను అమలు చేయడంలో దిట్ట. దీంతో అటు brs దగ్గరికి చేసుకోలేక… ఇటు కాంగ్రెస్ లో ఉండలేక ఆ ముగ్గురు సతమతం అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకుంటే… ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ఎమ్మెల్యేలు అటు కక్కలేక…ఇటు మింగలేక అన్నట్టుగా ఉన్నారట. కాంగ్రెస్‌లోనే కంటిన్యు అవ్వాలన్నా.. ఆ పార్టీ నేతలతో లొల్లి తప్పదు. ఇలా కోరి తలనొప్పులు తెచ్చుకుంటున్నారన్నది ఓపెన్ టాక్.