Glopixs : మార్కెట్ లోకి కొత్త ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘గ్లోపిక్స్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినోద రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తాం అంటూ మార్కెట్ లోకి కొత్త ఓటీటీ ఫ్లాట్ ఫాం రాబోతోంది. కొత్త ఓటీటీ సంస్థ “గ్లోపిక్స్’ 2025 ఏడాది ప్రారంభంలోనే గ్లోపిక్స్ సంస్థ ఓ అడుగు ముందుకు వేసింది. గురువారం (జనవరి 2)న గ్లోపిక్స్ లోగోను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఏడాది వేసవిలో పూర్తి స్థాయిలో ఈ ఓటీటీ సంస్థ అందుబాటులోకి రానుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ గ్లోపిక్స్‌ను విన్సే ఎల్ ఏ, అనిత సంయుక్తంగా స్థాపించగా.. లోకేష్ సన్నయ్య ఫౌండర్ మెంబర్/సిఎమ్ఓ ఫౌండింగ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. మారుతి రాజీవ్ ఫౌండర్ మెంబర్/సిటిఓ, రూపేశ్ మామిళ్లపల్లి హైదరాబాద్ కంటెంట్ హెడ్‌గా వ్యవహరించనున్నారు. నేడు ఈ లోగోను సౌత్‌లో మూడు చోట్ల ఘనంగా లాంచ్ చేసారు. బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో ఈ లోగోను లాంచ్ చేశారు. ఇక ఈ ఫ్లాట్ ఫాంలో ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, రియాల్టీ షోలు అంటూ 360 డిగ్రీల ఎంటర్టైన్మెంట్‌ను అందించబోతున్నారు.
1000 Crores: రిలీజ్ కి రెడీ అవుతున్న మోహన్ లాల్ 1000 కోట్లు
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్లోపిక్స్ ఫౌండర్ మెంబర్ మారుతి రాజీవ్ మాట్లాడుతూ.. ‘నేడు మా గ్లోపిక్స్ లోగోను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మన కల్చర్, మన సంస్కృతి, మన మూలాల్లోంచి కథలను గ్లోబల్‌గా అందించేందుకు మా గ్లోపిక్స్‌ను ప్రారంభిస్తున్నాం. మంచి కంటెంట్, కాన్సెప్ట్‌లను అందించేందుకు ఈ కొత్త ఫ్లాట్ ఫాంను తీసుకొస్తున్నామ’ని అన్నారు. గ్లోపిక్స్ ఫౌండింగ్ మెంబర్ లోకేష్ మాట్లాడుతూ.. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 అందరికీ అంతా మంచి జరగాలి. మేం మా గ్లోపిక్స్ లోగోను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ప్రాంతీయతను చాటేలా, లోకల్ టాలెంట్, కల్చర్‌ను ఎంకరేజ్ చేసేందుకు గ్లోపిక్స్‌ను స్టార్ట్ చేస్తున్నాం. అన్ని రకాల కంటెంట్‌ను అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. మన కంటెంట్‌ను గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లాలని అనుకుంటున్నామ’ని అన్నారు. గ్లోపిక్స్ హైదరాబాద్ కంటెంట్ హెడ్ రూపేశ్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్, కాన్సెప్ట్‌లను అందించేందుకు ఈ కొత్త ఫ్లాట్ ఫాంను తీసుకొస్తున్నామని అన్నారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!