Blackmail: గుజరాత్ బనస్కాంత జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేస్తూ 16 నెలల పాటు ఏడుగురు వ్యక్తులు పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి కాలేజీ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Read Also: Off The Record: మింగలేక-కక్కలేక అన్నట్టుగా ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి?
2023లో పాలన్‌పూర్‌లోని ఒక కళాశాలలో చేరడం ప్రారంభించిన నెలల తర్వాత ఆరుగురు నిందితుల్లో ఒకరు, 20 ఏళ్ల బాధిత అమ్మాయితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమయ్యాడు. నవంబర్ 2023లో, అతను ఆమెను ఒక హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేద్ధామని ఒత్తిడి చేసి ఒప్పించాడు. తనను ఉద్దేశపూర్వకంగా ఆమె దుస్తులపై ఆహారాన్ని పడేలా చేసి, దానిని శుభ్రం చేసే నెపంతో ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు. బాత్రూంలో విద్యార్థిని తన బట్టలు తీసేసి శుభ్రం చేసుకుంటున్న సమయంలో, బలవంతంగా గదిలోకి దూరిన విశాల్ చౌదరి అనే నిందితుడు ఆమె నగ్న వీడియోలను షూట్ చేశాడు.
ఈ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తానని బెదిరిస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే వీడియోతో నిందితుడి స్నేహితులు కూడా నవంబర్ 2023 మరియు ఫిబ్రవరి 2025 మధ్య వేర్వేరు సందర్భాలలో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధిత అమ్మాయి పాలన్‌పూర్ పోలీసులను ఆశ్రయించింది. నిందితులు అందరిపై అత్యాచార చట్టాల ప్రకారం కేసు నమోదైంది. నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.