ఢిల్లీ – తెలంగాణలో లోకల్ కోటా కింద ఉన్నత విద్య అభ్యసించాలని అనుకుంటున్నారా అయితే ఒక్క క్షణం ఆగండి. స్థానికత అంశంపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. తెలంగాణలో వరుసగా 9 ,10, 11,12 తరగతులు చదువితేనే లోకల్ అంటూ స్పష్టం చేసింది. అయితే ఈ రూల్స్ లో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం మినహాయింపు ఉంటుందనే షరతు పెట్టింది సుప్రీం కోర్ట్. లోకల్ రిజర్వేషన్ అంశంపై తెలంగాణకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. వరుసగా నాలుగేళ్లు…
స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. తెలంగాణలో వరుసగా 9 , 10, 11, 12 తరగతులు చదువుతేనే లోకల్ అంటూ తీర్పు వెలువురించింది సుప్రీంకోర్టు.. దీంతో, తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో ప్రభుత్వానికి ఊరట దక్కినట్టు అయ్యింది..
Harish Rao: తెలంగాణ భవన్ లో మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బ్యాగుల మీద నాలెడ్జి ఉన్న రేవంత్ రెడ్డికి బేసిన్ ల మీద లేదు అని ఆరోపించారు. ఈయనకు బేసిక్స్ తెలియదు.. బేసిన్స్ తెలియదు.. మన రాష్ట్ర పరువు పోయింది అని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల దృష్ట్యా పర్యావరణ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ మంత్రి పొన్నం చొరవతో పెట్రోల్ ,డీజిల్ లేని 65 వేల కొత్త త్రి వీలర్ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది. కొత్త ఆటో రిక్షాలు పరిమిట్లు ఇవ్వడానికి లేదు. ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ…
దొరకి ఏం ఆలోచన వచ్చిందో కానీ అర్ధరాత్రి వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసేశారు అని పేర్కొన్నారు. మళ్ళీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్ లో నమోదైన కేసులన్నిటిని ఇక నుండి సీఐడీ విచారించనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసు నమోదు చేసారు. సైబరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు అయ్యాయి. అగ్ర హీరోల నుంచి యూట్యూబర్స్ వరకు…
Telangana Govt: టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక, 2.5 శాతం డీఏను రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై 3.6 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
కులగణనలో వివరాలు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం.. రేపటి నుండి 28వ తేదీ వరకు (అంటే 12రోజుల పాటు) రీ సర్వే చేపట్టనుంది. అందుకోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111 ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పని చేయనుంది.
ప్రజా ప్రభుత్వం మరో రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించటంతో పాటు.. అక్కడికక్కడే 6,15,677 మంది అర్హులకు లబ్ధి కల్పించింది. అదే రోజున రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆర్థిక శాఖ రూ. 579 కోట్లు విడుదల చేసింది.
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక జేఏసీ నోటీసు ఇచ్చింది. బస్ భవన్‌లో అధికారులకు కార్మిక సంఘం నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. 21 డిమాండ్లతో సమ్మె నోటీసులు యాజమాన్యానికి అందించారు ఆర్టీసీ యూనియన్ నేతలు.