తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (శుక్రవారం) రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జనవరి 3న సావిత్రిబాయి ఫులే జయంతిని మహిళా టీచర్స్ డే నిర్వహించాలని ఉత్తర్వుల్లో తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సందడి కనిపిస్తోంది. అయితే.. దీపావళి రోజున మనమంతా కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే, దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో మోహరించి తమ కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో.. దేశ ప్రధాని మోడీ సైనికులను ప్రోత్సహించారు. గుజరాత్‌లోని కచ్‌లో బీఎస్‌ఎఫ్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. మోడీ వారితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పారా మిలటరీ జవాన్లతో కలిసి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సతీమణి కావ్యతో కలిసి పారామిలటరీ జవాన్లకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పండగలు, పబ్బాలు అనే తేడా లేకుండా కుటుంబాలను వదిలి నిరంతరం దేశసేవలో పనిచేస్తున్న సాయుధ బలగాలకు, వారి కుటుంబసభ్యులకు దీపావళి సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
భారతదేశ ప్రజలు హోలీ పండుగకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. రంగులు జల్లుకుంటూ ప్రతీ ఒక్కరు సంబరాలు జరుపుకునే ఈ పండుగ కోసం.. ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తుంటారు. దేశంలో ప్రతీ వీధి, ప్రతీ ప్రాంతం రంగులతో నిండిపోయే ఏకైక వేడుక ఇదే. అయితే హోలీ జరుపుకోవడంలో ప్రతీ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకనే ఉన్నవాటిలో ఉత్తమమైనవి ఏవో తెలుసుకుంటే.. ఈ సారి హోలీని ఎంజాయ్ చేయడానికి ముందుగానే సిద్ధం కావచ్చు. ఇండియాలో హోలీ జరుపుకునేందుకు బెస్ట్…
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లా దీక్షకు ముందు అమెరికాలో కార్ల ర్యాలీ చేపట్టారు. న్యూజెర్సీ నగరంలో హిందూ సమాజానికి చెందిన ప్రజలు 350 వాహనాల కాన్వాయ్‌లో శ్రీరాముడి చిత్రంతో కూడిన జెండాలను పట్టుకుని తిరిగారు. అయోధ్యలోని రామ మందిరంలో జరిగే పవిత్రోత్సవానికి ముందు హిందూ మతానికి చెందిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు, వేడుకలను నిర్వహిస్తున్నారు. కాగా.. విశ్వ హిందూ పరిషత్ (VHP), US చాప్టర్, అమెరికాలోని హిందువుల సహకారంతో.. ఆలయ పవిత్రతపై 10 రాష్ట్రాల్లో 40కి…
విజయదశమి సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్ర పూజలు చేశారు. అనంతరం సైనికులతో కలిసి విజయదశమి వేడుకలు జరుపుకున్నారు. తవాంగ్ చేరుకోవడానికి ముందు రక్షణ మంత్రి అస్సాంలోని తేజ్‌పూర్ లో సైనికులతో ముచ్చటించారు. అన్ని స్థాయిల సైనికులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి భోజనం చేస్తారనే భావనను ప్రశంసించారు.