తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (శుక్రవారం) రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జనవరి 3న సావిత్రిబాయి ఫులే జయంతిని మహిళా టీచర్స్ డే నిర్వహించాలని ఉత్తర్వుల్లో తెలిపింది.
దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు కియా ద్వారా అనేక అద్భుతమైన వాహనాలు భారత మార్కెట్లో విక్రయించబడుతున్న సంగతి తెలిసిందే.. కాగా.. ఇటీవల ఇండియాలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూనే కంపెనీ మరో కొత్త వాహనాన్ని విడుదల చేసింది. అదే కియా సిరోస్ ఎస్‌యూవీ.. కియా మోటార్స్ జనవరి 3 నుంచి తన పోర్ట్‌ఫోలియోలో సరికొత్త సిరోస్ ఎస్‌యూవీ బుకింగ్‌ను ప్రారంభించనుంది. అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి దీని బుకింగ్ ప్రారంభం కానుంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిరుద్యోగులకు మంచి అవకాశం.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. నారావారిపల్లెలో మెగా జాబ్ మేళా జరగబోతోంది. భారీగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. జనవరి 3వ తేదీన నారావారిపల్లెలో 20 కంపెనీలతో మెగా జాబ్ మేళా జరుగనుంది.
జనవరి 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడలో పర్యటించనున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు.