Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వన్యప్రాణులు, పాములు వంటి వాటి వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. పాముల పేరు వినగానే చాలామంది భయంతో వణికిపోతారు. మరికొందరు అవి ఉన్న దరిదాపుల్లో కూడా ఉండటానికి భయపడతారు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం అందరూ షాక్ అవ్వక తప్పదు. ఈ వీడియోలో కొంతమంది చిన్నారులు చనిపోయిన ఒక పెద్ద కొండ చిలువను తాడులా పట్టుకుని, దాన్ని స్కిప్పింగ్ రోప్‌లా ఉపయోగిస్తూ ఆడుతున్నారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని వూరాబిండా గ్రామంలో చోటుచేసుకుంది. సెంట్రల్ క్వీన్స్ ల్యాండ్ లోని రాక్‌హాంప్టన్ సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో చిన్నారులు రోడ్డుపక్కన చనిపోయిన భారీ కొండ చిలువను చూశారు.
Read Also: WPL 2025 Final: బెంగళూరుతో చివరి లీగ్ మ్యాచ్.. ఫైనల్ వెళ్లేందుకు ముంబైకి ఛాన్స్!
మాములుగా పాము చనిపోయినా అది దగ్గర్లో ఉంటేనే భయం కలుగుతుంది. కానీ కొందరు పిల్లలు మాత్రం భయం లేకుండా దాన్ని పట్టుకుని, ఆటలో భాగంగా స్కిప్పింగ్ రోప్‌గా ఉపయోగించారు. ఇద్దరు చిన్నారులు చిలువను ఇరువైపులా పట్టుకుని అటుఇటు అచ్చం స్కిప్పింగ్ తాడులా తిప్పారు. మరికొందరు పిల్లలు మధ్యలో స్కిప్పింగ్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. అలా పాముతో కొద్దిసేపు ఆఫుకున్న తర్వాత చివరికి దాన్ని దూరంగా పడేసి వెళ్లిపోయారు.
Viral Video: జియోమెట్రీ బాక్స్‌తో అద్భుతం సృష్టించిన పిల్లలు
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక వీడియో చూసిన నెటిజన్లు వీరి ధైర్యంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీరికి ఇంత ధైర్యం ఏంటో అని కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు, వీళ్లు చిన్నప్పటి నుంచే ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి చర్యలు చేపడతారో అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను వీక్షించి ఒక కామెంట్ చేసేయండి.