అజింక్యా రహానే సారథ్యంలోని ముంబై ఆదివారం ఇరానీ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మ్యాచ్ డ్రా అయింది. లక్నోలోని ఇకాన్ స్టేడియం వేదికగా జరిగిన ఇరానీ కప్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేసింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఐదో రోజు ముంబై స్కోరు రెండవ ఇన్నింగ్స్‌లో 329/8 ఉంది. దీంతో.. ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు.…
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. క్రీజులో షాద్ మాన్ ఇస్లాం (7), మోమినుల్ హక్ ఉన్నారు. కాగా.. రెండు వికెట్లను స్పిన్ మాయజాలం అశ్విన్ పడగొట్టాడు. బంగ్లాదేశ్ ప్రస్తుతం 26 పరుగుల వెనుకంజలో ఉంది. కాగా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉంది.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 149 పరుగుల వద్ద బంగ్లా ఆలౌట్ అయ్యింది. దీంతో.. భారత్ 227 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. భారత్ బౌలర్లలో బుమ్రా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి బంగ్లా ఆటగాళ్లను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో రెండేసి వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో అత్యధికంగా షకీబ్ అల్ హసన్ (32), మెహిదీ హాసన్ మిరాజ్ (27), లిటన్ దాస్ (22) పరుగులు చేశారు.
ఇండియా తో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 62 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. అయితే ఈరోజు టీం ఇండియా 325 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ జట్టును మొదట సిరాజ్ భారీ దెబ్బ కొట్టాడు. టామ్ లాథమ్, విల్ యంగ్, రాస్ టేలర్ ముగ్గురిని త్వరగా ఔట్ చేసాడు. ఆ తర్వాత ముగిలిన బౌలర్లు కూడా తమ పని ప్రారంభించారు. ఆ వెంటనే…