Health Tips: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల అనేక ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతారు. అయితే పడుకునేముందు కొన్ని ఆహారపదార్థాలు తినొద్దని వైద్యులు చెబుతున్నారు. మన శరీరానికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రపోవడం వల్ల మన జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి. ప్రతి వ్యక్తి రాత్రిపూట కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రిపూట నిద్ర రాకపోవడం అనే సమస్యను ఎదుర్కొనే వారు చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలో మీరు రాత్రి నిద్రపోయే ముందు ఒక నియమాన్ని పాటించడం చాలా ముఖ్యం. తద్వారా మీకు మంచి నిద్ర వస్తుంది. అయితే కొందరు వ్యక్తులు ఇలాంటి తప్పులు చేస్తే.. నిద్ర భంగం మరియు నిద్రలేమి సమస్యను ఎదుర్కోవలసి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆ తప్పులేంటో ఒకసారి చూద్దాం.
Read Also: Assam: బ్రహ్మపుత్ర నది కింద సొరంగం నిర్మిస్తున్న భారత్.. చైనాకు చుక్కలే
రాత్రి భోజనం మరియు నిద్ర మధ్య తక్కువ సమయం- రాత్రి భోజనం త్వరగా చేయాలని మీరు తరచుగా వినే ఉంటారు. మీరు రాత్రిపూట ఆలస్యంగా డిన్నర్ చేసినప్పుడు మీరు గుండెల్లో మంటను ఎదుర్కోవలసి ఉంటుంది. దీనివల్ల పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతారు. అంతేకాకుండా రాత్రిపూట మన జీవక్రియ పని చేయడం ఆగిపోతుంది. అలాంటప్పుడు మీరు నిద్రవేళకు కనీసం 2 గంటల ముందు మీ రాత్రి భోజనం చేయడం అవసరం. భారీ డిన్నర్ చేయడం- రాత్రి భారీ డిన్నర్ చేయడం వల్ల ఆహారం జీర్ణం కావడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా కడుపు ఉబ్బరాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా మీరు అజీర్ణం, మలబద్ధకం మరియు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Read Also: Tech Tips: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయ్యిందా? ఇలా చేస్తే స్పీడ్ అవుతుంది..
పోషకాలను తీసుకోకపోవడం- రాత్రిపూట లైట్ డిన్నర్ చేయాలి. కానీ మీరు ఆహారంలో పోషకాలను చేర్చకూడదని దీని అర్థం కాదు. మీరు ఆహారంలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు మరియు మినరల్స్ మొదలైనవాటిని ఉపయోగిస్తే.. అర్ధరాత్రి హాయిగా నిద్రపోవచ్చు. తరచుగా రాత్రి భోజనం తర్వాత చాక్లెట్ తినడం అలవాటు చేసుకుంటారు. కెఫిన్ నరాలను ఉత్తేజపరుస్తుంది. దీంతో నిద్రపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా ఆల్కహాల్ తీసుకోవడం – ఆల్కహాల్ తీసుకుని పడుకుంటే చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. దీంతో నిద్ర పట్టదు.. అంతేకాకుండా మరుసటి రోజు ఆ ప్రభావం పడుతుంది.