అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఓ ప్రియుడికి ఘోర అనుభవం ఎదురైంది. చీకట్లో ప్రియురాలి కోసం వెళ్తుండగా గ్రామస్తుడు ఒకతను చూశాడు. అతను చూడకుండా ఉండేందుకు దాక్కోవడంతో.. విషయం సీరియస్ గా మారింది. దీంతో.. ప్రేమికుడిని చూసిన గ్రామస్తుడు.. గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. గ్రామస్తులంతా కలిసి కర్రలు పట్టుకుని వచ్చి యువకుడిని దొరకబట్టి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన యూపీ ఇటావాలోని రాంపుర గ్రామంలో జరిగింది.
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా ఘటనతో దేశం అట్టుడుకుతోంది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా కూడా కామాంధుల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. కనీస భయం లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు
కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జారీ చేసిన అడ్వైజరీపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సూచనలు చేయడానికి బదులు క్యాంపస్‌లో భద్రతను పెంచాలంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సదరు ఆస్పత్రి జారీ చేసిన సూచనల అడ్వైజరీని రద్దు చేసినట్లు ప్రకటించింది.
10 మంది వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున న్యూ అశోక్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన మామే తమపై దాడి చేశారని బాధితురాలు కాజల్ ఆరోపిస్తుంది. ఆస్తి తగాదా విషయంలో దాడికి పాల్పడినట్లు చెబుతుంది.
రాత్రి పడుకున్నప్పుడు తరచూ గుండెల్లో మంట వస్తుందా? ఇది ఆరోగ్యానికి ముప్పుగా మారొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏర్పడే మంట ముఖ్యంగా రాత్రి మీ నిద్రను పాడు చేస్తుంది. దీనిని గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి లేదా (GERD) అంటారు.
ఈరోజుల్లో నిద్రలేమి సమస్య ప్రజల్లో పెరిగిపోతోంది. దీంతో వారు అనేక వ్యాధులకు గురవుతున్నారు. మానసిక సమస్యల వల్ల లేదా రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు వల్ల నిద్రలేమి వస్తుందని తరచుగా నమ్ముతారు, అయితే శరీరంలో విటమిన్లు లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని మీకు తెలుసా.
కొబ్బరి నూనె చర్మం, జుట్టు మరియు ఆరోగ్యానికి మెరుగైన సంరక్షణను అందిస్తుంది. ఉత్తమ మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా పరిగణించబడే కొబ్బరి నూనెను అనేక విధాలుగా రొటీన్‌లో చేర్చవచ్చు. దీని వల్ల ఎటువంటి నష్టాలు జరుగవు. మన చర్మాన్ని లోపల మరియు వెలుపల పోషించే అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. రాత్రి పూట పూస్తే మరుసటి రోజు ఉదయం వరకు దీని ప్రభావం కనిపిస్తుంది.
ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల అనేక ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతారు. అయితే పడుకునేముందు కొన్ని ఆహారపదార్థాలు తినొద్దని వైద్యులు చెబుతున్నారు. మన శరీరానికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రపోవడం వల్ల మన జీవక్రియలు సక్రమంగా పనిచేస్తాయి. ప్రతి వ్యక్తి రాత్రిపూట కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రిపూట నిద్ర రాకపోవడం అనే సమస్యను ఎదుర్కొనే వారు చాలా మంది…
పెళ్లి కోసం వరుడితో పాటు అతని కుటుంబసభ్యులు వధువు ఇంటికి చేరుకునేందుకు 28 కిలోమీటర్లు నడిచారు. డ్రెవర్ల సమ్మె కారణంగా పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడుతూ దాదాపు 28 కిలోమీటర్లు నడిచారు.
Howling Dogs : కుక్క అరుపులు ఎప్పుడైనా తీక్షణంగా విన్నారా? అవి బిగ్గరగా మొరిగితే ఏడుస్తున్నాయని అంటారు. కుక్కలు తరచుగా రాత్రిపూట అరుస్తూ ఉంటాయి. కుక్కలు మనుషులకు కనపడని ఆత్మలను చూసి ఏడుస్తున్నాయని చాలా మంది అనుకుంటారు.