ఇప్పుడు జనాలు తిండి లేకున్నా ఉంటారు కానీ, చేతిలో ఫోన్ లేకుంటే మాత్రం అస్సలు ఉండరు.. పొద్దున్నే లేవగానే అందరు ఫోన్ పట్టుకోవడం చేస్తుంటారు..మన జీవితంలో ఫోన్ అంతలా భాగం అయ్యింది..సాధారణంగా ఫోన్లలో స్టోరేజ్ అయిపోయినా.. యాప్ లు ఎక్కువగా ఉన్నా ఫోన్ స్లో అయిపోతుంది. ఆ సమయంలో రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అని, యువర్ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని నోటిఫికేషన్లు తరచూ చూస్తుంటాం. ఆసమయంలో ఫోన్ పనితీరు సక్రమంగా ఉండదు. అలాగే కొత్త ఫైళ్లు, ఫొటోలు, వీడియోలు, ఇతర వేరే యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవడం కుదరదు.. అలా ఫోన్ స్లో అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ఆడియో యాప్స్, ఓటీటీ యాప్స్, సోషల్ మీడియా యాప్స్, గేమింగ్ యాప్స్, ఫొటో/వీడియో యాప్స్.ఇవే సాధారణంగా ఎక్కువ ఫోన్ స్టోరేజ్ ని వాడుకుంటాయి. అయితే వీటిల్లో ఏ యాప్ వల్ల మీ ఫోన్ స్లో అవుతుంది? అధికంగా స్టోరేజ్ ఏది తీసుకుంటుందో కొన్ని టిప్స్ ద్వారా తెలుసుకోవచ్చు.. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం..
గూగుల్ ప్లే స్టోర్ యాప్ లోకి వెళ్లి ప్రోఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత మేనేజ్ యాప్ అండ్ డివైజ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.దానిలో యాప్స్ లిస్ట్ మీకు ఓపెన్ అవుతుంది. వాటి సైజ్ ఆధారంగా అవి మీకు కనిపిస్తాయి.వాటి నుంచి మీరు అధికంగా స్టోరేజ్ వినియోగిస్తున్న యాప్ ను గుర్తించవచ్చు.. ఇది మామూలు స్మార్ట్ ఫోన్లకు.. అదే ఐ ఫోన్స్ కు ఎలాగంటే..ముందుగా ఐఫోన్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.దానిలో జనరల్ సెక్షన్ పై క్లిక్ చేయాలి.
వచ్చిన ఆప్షన్లలో నుంచి ఐఫోన్ స్టోరేజ్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి. దానిలో యాప్ లిస్ట్ అనేదానిపై క్లిక్ చేయాలి.అప్పుడు మీకు యాప్ లు.. అవి వాడుకుంటున్న స్టోరేజ్ వివరాలు కనిపిస్తాయి. దానిలో అధిక స్టోరేజ్ వాడుకుంటున్న యాప్ ఏంటో తెలుసుకోవచ్చు.. ఇలా చేసి ఆ యాప్ మీరు అంతగా వినియోగించనివి అయితే వెంటనే డిలీట్ చేసేసుకోవాలి. దాని వల్ల మీ ఫోన్ స్టోరేజ్ ఆదా అవడంతో పాటు ఫోన్ స్పీడ్ కూడా పెరుగుతుంది.. అదృష్టం విధంగా ఫోన్ కాచి డేటాను క్లియర్ చేస్తూ, రీబూట్ చేస్తూ ఉండాలి.. మీ ఫోన్ సేఫ్ గా కూడా ఉంటుంది..