Assam: బ్రహ్మపుత్ర నది కింద సొరంగం నిర్మిస్తున్న భారత్.. చైనాకు చుక్కలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: చారిత్రాత్మక బ్రహ్మపుత్ర నది కింద భారత సైన్యం సొరంగం నిర్మిస్తుందని గతంలోనే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. ప్రతిపాదిత సొరంగం బ్రహ్మపుత్ర నది కింద మిసా నుంచి ప్రారంభమై తేజ్‌పూర్ వరకు కొనసాగుతుంది. చైనా కుయుక్తులను ఎదుర్కోవడానికి, భారతదేశం LAC ప్రాంతం అభివృద్ధిలో భారత్ నిమగ్నమై ఉంది. LACకి దళాలను వేగంగా తరలించడానికి బ్రహ్మపుత్ర కింద ఈ వ్యూహాత్మక సొరంగం నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మార్గం సుగమం చేసింది. గోహ్‌పూర్, నుమాలిఘర్ మధ్య ప్రతిపాదిత 35 కి.మీ పొడవైన కారిడార్ కోసం డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్)ని సిద్ధం చేయడానికి జూలై 4 న సాంకేతిక బిడ్‌లను తెరవనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.
వివిధ సొరంగాల ద్వారా రోడ్డు, రైలు ట్రాక్‌లు వేస్తామని సీఎం శర్మ చెప్పారు. ఈ సొరంగం ప్రాజెక్టుకు రూ.6,000 కోట్లు వెచ్చించనున్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఆమోదం తెలిపారు. నుమాలిగఢ్ నుండి గోహ్పూర్ వరకు దూరం దాదాపు 220 కి.మీలు. దీనికి 6 గంటల సమయం పడుతుంది. సొరంగం నిర్మాణంతో ఈ దూరం 33 కి.మీ మేర తగ్గుతుంది. దీంతో పాటు అరగంట సమయం కూడా ఆదా అవుతుంది.
Also Read
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
Read Also:SPY : స్పై సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రానున్న మెగాస్టార్..?
సొరంగం నిర్మాణంతో NH37లో ట్రాఫిక్ తగ్గుతుంది.. ప్రజలు సుఖంగా ఉంటారు. ప్రస్తుతం బ్రహ్మపుత్ర ఉత్తరం నుండి దక్షిణానికి ట్రాఫిక్ ప్రతిపాదిత సొరంగం నుండి 100 కి.మీ దూరంలో ఉన్న కోలియా భోమోరా వంతెన ద్వారా తరలించబడుతుంది. సొరంగం బ్రహ్మపుత్ర నది యొక్క నేల స్థాయి నుండి దాదాపు 32 మీటర్ల దిగువన ఉంటుంది. నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లూయిస్ బెర్గర్ అనే నిపుణుల సలహాదారు ద్వారా ఈ సొరంగం కోసం అధ్యయనాలు చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లు ఏడాది పొడవునా అనుసంధానంగా ఉండగలుగుతాయి. సొరంగం సహాయంతో, సైనిక సరఫరా, ఆయుధాల సరఫరా కూడా జరుగుతుంది. ఈ సొరంగంలో వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలవు. ఇంగ్లిష్ ఛానల్ తరహాలో బ్రహ్మపుత్ర నది కింద సొరంగాలు నిర్మించాలని ప్రభుత్వం యోచించాలని సైన్యం కోరినట్లు రక్షణ వర్గాల సమాచారం. శత్రువులు వంతెనలను సులభంగా లక్ష్యంగా చేసుకోవచ్చని సైన్యం భావిస్తుంది.
ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, కాజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌కు దక్షిణంగా ఉన్న NH37లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ నుండి ఉపశమనం లభిస్తుంది. చైనా సరిహద్దులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌కు సొరంగం ద్వారా దళాలను తీసుకెళ్లవచ్చు. వస్తువులను వేగంగా బదిలీ చేయవచ్చు. దీని వల్ల దేశ భద్రత పెరుగుతుంది. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతంలో అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
Read Also:AP CM Jagan Tour: ఈ నెల 28న కురుపాం నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!