Mahindra Thar: దేశీయ కార్ మేకర్ దిగ్గజం మహీంద్రా తన థార్ మోడల్ పై ఏప్రిల్ నెలలో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా ఎక్కువగా అమ్ముడవుతున్న SUVలలో మహీంద్రా థార్ ఒకటి. కంపెనీ థార్ 4X4 వెర్షన్‌పై ఆకర్షణీయమైన తగ్గింపును అందిస్తోంది. థార్(ఫోర్ వీల్ డ్రైవ్) పెట్రోల్, డిజిల్ వేరియంట్లపై దాదాపుగా రూ. 40,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం థార్ AX (O), LX వేరియంట్లలో లభిస్తోంది.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతోంది. ఆ దేశానికి మిత్రదేశాలతో పాటు ఐఎంఎఫ్ వద్ద అప్పు పుట్టడం లేదు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక వేళ ఎంత ధర పెట్టి కొందాం అని అనుకున్న మార్కెట్లలో సరుకులు లభించడం లేదు. గోధుమ పిండి కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గోధుమ కోసం అక్కడి ప్రజలు ఓ యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే గోధుమ పిండి కేంద్రాల వద్ద ఇటీవల కాలంలో తొక్కిసలాటలు జరిగి…
IMF: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3 శాతం కన్నా తక్కువ వృద్ధిని సాధిస్తుందని, 2023లో ప్రపంచవృద్ధిలో భారత్, చైనాల వాటానే సగం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ గురువారం తెలిపారు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైెరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రం ప్రభావం చూపించాయని, దీంతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని ఆమె హెచ్చరించారు.
Israel blames Hamas for multiple rockets launched from Lebanon: ఇజ్రాయిల్, లెబనాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. లెబనాన్ నుంచి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్ దాడులు చేసినట్లు ఆ దేశం ఆరోపిస్తోంది. ఇప్పటికే లెబనాన్ చర్యలపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పందించారు. శతృవులు మూల్యం చెల్లించుకోక తప్పదని మెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ గురువారం అర్థరాత్రి పాలస్తీనా గాజా స్ట్రిప్ పై వైమానికి దాడులు నిర్వహించింది.
CNG Rates: సహజవాయువు ధరను నిర్ణయించేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతిని తీసుకురాబోతోంది. ధర పరిమితి విధించేందుకు కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. యూఎస్ఏ, కెనడా, రష్యా వంటి విదేశాల్లోని గ్యాస్ ధరలతో కాకుండా దిగుమతి చేసుకున్న ముడి చమురు ధరతో అనుసంధానించనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీని వల్ల పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) ధర 10 శాతం వరకు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ) ధర 6 శాతం నుంచి 9 శాతానికి తగ్గుతుందని ఆయిల్ సెక్రటరీ పంకజ్ జైన్…
Delhi High Court: మహిళల ప్రైవసీకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాత్ రూంలో స్నానం చేయడమనేది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం అని, ఒక వేళ బాత్ రూం ఇంటి బయట ఉన్నా, తాత్కాలిక నిర్మాణమైనంత మాత్రాన అక్కడ స్నానం చేయడం బహిరంగ చర్యగా పేర్కొనలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
Care Hospital: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 102 సంవత్సరాల ప్రముఖ స్వతంత్ర సమరయోధులు శ్రీ ఏటికూరి కృష్ణ మూర్తికి కేర్ ఆస్పత్రి తరపున సత్కరించింది. గురువారం కేర్ ఆసుపత్రి అవుట్ పేషెంట్ విభాగంలో జరిగిన హెల్త్ ఫర్ అల్ కార్యక్రమంలో శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (WHD) జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రాధాన్యతా ప్రాంతాన్ని హైలైట్ చేయడానికి ఒక థీమ్‌ని ఎంపిక చేస్తారు.
India Oil Exports: గ్లోబల్ ఆయిల్ మార్కెట్ లో ప్రస్తుతం ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్, రష్యా ఆయిల్ తో వ్యాపారం చేస్తోంది. రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు ప్రస్తుతం ఆయిల్ కోసం భారత్ ను ఆశ్రయిస్తున్నాయి. యుద్ధాన్ని చూపిస్తూ యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును నిలిపేశాయి. దీంతో పాటు రష్యా క్రూడ్ ఆయిల్ ధరపై ధర పరిమితిని విధించాయి.
Donald Trump: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ కేసులో డొనాల్డ్ ట్రంప్ న్యాయపరమైన విచారణ ఎదుర్కొంటున్నారు. 2016 ఎన్నికల ముందు స్టార్మీ డేనియల్ తో ఉన్న శృంగార సంబంధాన్ని దాచిపెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుల నేపథ్యంలో ఆయన న్యూయార్క్ మాన్ హట్టన్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. మొత్తం 34 అభియోగాలను ఎదుర్కొంటున్నారు ట్రంప్.
Covid 19: దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,335 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గత రోజుతో పోలిస్తే 20 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 25,587 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత సెప్టెంబర్ 23 తర్వాత తొలిసారిగా కేసుల సంఖ్య 5 వేలను దాటింది. ప్రస్తుతం రోజూవారీ పాజిటివిటీ రేటు 3.32 శాతంగా ఉంది.