Israel blames Hamas for multiple rockets launched from Lebanon: ఇజ్రాయిల్, లెబనాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. లెబనాన్ నుంచి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై రాకెట్ దాడులు చేసినట్లు ఆ దేశం ఆరోపిస్తోంది. ఇప్పటికే లెబనాన్ చర్యలపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పందించారు. శతృవులు మూల్యం చెల్లించుకోక తప్పదని మెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ గురువారం అర్థరాత్రి పాలస్తీనా గాజా స్ట్రిప్ పై వైమానికి దాడులు నిర్వహించింది.
Read Also: IPL 2023: లక్నోతో అమీతుమీకి సిద్ధమైన సన్ రైజర్స్ హైదరాబాద్
ఇటీవల జెరూసలెంలోని అల్-అక్సా మసీదులో పాలస్తియన్లతో ఇజ్రాయిల్ దళాలు ఘర్షణకు దిగాయి. ఈ చర్య జరిగిన తర్వాత ఇజ్రాయిల్ పై దాడులు జరిగాయి. లెబనాన్ భూభాగం నుంచి 34 రాకెట్లతో తమ దేశంపైకి దాడికి పాల్పడినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. హమాస్ చర్యకు ప్రతిస్పందనగా హమాస్ కు చెందిన రెండు సొరంగాలను, రెండు ఆయుధాల తయారీ స్థలాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ దాడి తర్వాత గాజా నుంచి ఇజ్రాయిల్ పైకి క్షిపణులతో దాడులు జరిగాయి. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ 25 రాకెట్లను అడ్డుకున్నట్లు మరో 5 ఇజ్రాయిల్ భూభాగంలో పడినట్లు ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది.
ఇప్పటికే అల్ – అక్సా మసీద్ ఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒత్తడిని ఎదుర్కొంటోంది ఇజ్రాయిల్. పవిత్ర రంజాన్ మాసంలో ఇజ్రాయిల్ దళాలు మసీదులో ఘర్షణకు కారణం అయ్యాయని ఆరోపిస్తున్నారు. యూదుల పాస్ వోర్, ముస్లింల పవిత్ర రంజాన్ సందర్భంగా హింస చెలరేగింది. దీని తర్వాత గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ పై దాడులు జరిగాయి. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ కూడా దాడులు చేస్తోంది.