REDMI Note 15 5G: భారత మార్కెట్‌లో షియోమీ మిడ్ రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ REDMI Note 15 5Gను 2026 జనవరి 6న అధికారికంగా విడుదల చేయనున్నట్లు నిర్ధారించింది. ఇప్పటికే ఆగస్టులో చైనాలో విడుదలైన ఈ ఫోన్ భారత్‌లో కొన్ని కీలక అప్‌గ్రేడ్స్‌తో రానుంది. ఈ మొబైల్ భారత వెర్షన్ లో REDMI Note 15 5G OIS (Optical Image Stabilization)తో కూడిన 108MP మెయిన్ కెమెరాను అందిస్తోంది. ఇది చైనా మోడల్‌లో ఉన్న 50MP కెమెరాతో పోలిస్తే భారీ అప్‌గ్రేడ్. అంతేకాదు ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఈ మొబైల్ ఒక వరమే అని చెప్పవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 6 Gen 3 SoCను ఉపయోగించారు. ఇది గత ప్రాసెసర్‌తో పోలిస్తే 30% CPU పనితీరు, 10% GPU పనితీరు మెరుగుదలను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. డైలీ యూజ్‌తో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు ఇది మరింత స్మూత్ అనుభవాన్ని ఇస్తుంది. REDMI Note 15 5G స్మార్ట్ ఫోన్ లో 6.77 ఇంచుల FHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటుతో రానుంది. ఈ స్క్రీన్ 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందించడంతో బయట వెలుతురులో కూడా క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. ఇది TÜV ట్రిపుల్ ఐ కేర్ సర్టిఫికేషన్ తో కళ్లపై ఒత్తిడి తగ్గించేలా రూపొందించారు.
Tamil Nadu: రేషన్ కార్డు దారులకు శుభవార్త.. రూ.3,000 నగదుతో పాటు ప్రత్యేక ప్యాకేజీ..!
ఈ ఫోన్‌లో 5520mAh భారీ బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే IP66 రేటింగ్ తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత Xiaomi HyperOS 2పై పనిచేస్తుంది. ఇంకా ముఖ్యమైన ఫీచర్లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ (IR) సెన్సార్, స్టీరియో స్పీకర్లు, డాల్బీ ఆటమ్స్ ఆడియో సపోర్ట్ ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, mi.com, అలాగే ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయించనున్నారు. ఇదే సమయంలో షియోమీ REDMI Pad 2 Pro ట్యాబ్లెట్‌ను కూడా టీజ్ చేస్తుండటంతో, ఈ టాబ్లెట్ కూడా స్మార్ట్‌ఫోన్‌తో పాటు భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా. ధర , మరిన్ని ఫీచర్స్ లాంచ్ రోజు తెలియనున్నాయి.
Perfection in every curve and detail.
Presenting the #REDMINote15 5G in its full glory, built for those who never compromise.
The countdown to 6th January 2026 begins now. Stay tuned.#FasterStrongerSimplyBetter #108MasterPixelEdition Know More: https://t.co/cv8IVXCGfx pic.twitter.com/x4qs5lVhv1
— Redmi India (@RedmiIndia) December 19, 2025