Poco M8, M8 Pro: భారత్‌లో పోకో (Poco) సంస్థ కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్ల లాంచ్‌ను అధికారికంగా టీజ్ చేసింది. అయితే ఫోన్ల పేర్లు, స్పెసిఫికేషన్లు, డిజైన్‌పై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే లీకులు, సర్టిఫికేషన్ లిస్టింగ్స్ ఆధారంగా ఈ డివైజ్‌లు త్వరలోనే భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. లీకైన నివేదికల ప్రకారం.. కొత్తగా రాబోయే ఈ స్మార్ట్ ఫోన్లు Poco M8, Poco M8 Proగా మార్కెట్లోకి రావొచ్చు. గత కొన్ని వారాలుగా ఈ రెండు మోడళ్లపై ప్రచారం జరుగుతోంది. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా ఇవి లాంచ్ అయ్యే అవకాశం లేకపోలేదు.
108MP కెమెరా, Snapdragon 6 Gen 3తో భారత్‌లో REDMI Note 15 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే..?
పోకో ఇండియా విడుదల చేసిన మొదటి టీజర్‌లో కేవలం కొత్త M-సిరీస్ వస్తోందని మాత్రమే వెల్లడించింది. కానీ లీకుల ప్రకారం Poco M8 అనేది Redmi Note 15 5Gకి రీబ్రాండెడ్ వెర్షన్ గా ఉండవచ్చని సమాచారం. అలాగే Poco M8 Pro, Redmi Note 15 Pro+ ఆధారంగా రూపొందించబడే అవకాశం ఉంది. భారత వెర్షన్, గ్లోబల్ వెర్షన్‌ల మధ్య కొన్ని కీలక తేడాలు ఉండవచ్చని లీకులు చెబుతున్నాయి. ముఖ్యంగా కెమెరా విభాగంలో మార్పులు కనిపించే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం భారత్‌లో విడుదలయ్యే Poco M8 Proలో 50MP మెయిన్ కెమెరా ఉండొచ్చు. అదే సమయంలో గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న Redmi Note 15 Pro+ మోడల్‌లో 200MP కెమెరా ఉండే అవకాశముందని సమాచారం.
Poco M8 Pro ఇప్పటికే TDRA (UAE), IMEI డేటాబేస్, FCC, IMDA వంటి సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించింది. అలాగే Poco M8 5G BIS, NBTC, IMDA, TDRA సర్టిఫికేషన్లను పూర్తి చేసుకుంది. ఇవన్నీ చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ల లాంచ్ చాలా దగ్గరలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. లీకైన డిజైన్ రెండర్స్ ప్రకారం ఫోన్లు బ్లాక్, బ్లూ రంగులతో పాటు డ్యూయల్ టోన్ సిల్వర్ బ్లాక్ వేరియంట్‌లో అందుబాటులోకి రావొచ్చు. వెనుక భాగంలో కుడి దిగువన పోకో బ్రాండింగ్ ఉండగా, స్క్విర్కిల్ షేప్ కెమెరా మాడ్యూల్‌లో మూడు రియర్ కెమెరాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ముందు భాగంలో హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా, కొంచెం మందమైన బెజెల్స్ కనిపిస్తున్నాయి. పవర్, వాల్యూమ్ బటన్లు కుడి వైపు ఉండగా.. కింద భాగంలో USB టైపు-C పోర్ట్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ ఉన్నాయి. Poco సంస్థ M8 సిరీస్‌పై మరిన్ని వివరాలు, అధికారిక లాంచ్ తేదీని వెల్లడించే అవకాశం ఉంది.