India Oil Exports: రష్యా ఆయిల్‌తో భారత్ వ్యాపారం.. యూరప్‌కు పెరిగిన ఎగుమతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Oil Exports: గ్లోబల్ ఆయిల్ మార్కెట్ లో ప్రస్తుతం ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్, రష్యా ఆయిల్ తో వ్యాపారం చేస్తోంది. రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు ప్రస్తుతం ఆయిల్ కోసం భారత్ ను ఆశ్రయిస్తున్నాయి. యుద్ధాన్ని చూపిస్తూ యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును నిలిపేశాయి. దీంతో పాటు రష్యా క్రూడ్ ఆయిల్ ధరపై ధర పరిమితిని విధించాయి. ఇక్కడ హైలెట్ విషయం ఏంటంటే ప్రస్తుతం భారత్, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నది రష్యా నుంచి వచ్చిన ఆయిల్ నే. అంటే రష్యా ఆయిల్ వయా భారత్ అన్నమాట.
2022-23 ఆర్థిక సంవత్సరంలో యూరప్ దేశాలకు డిజీల్, జెట్ ఇంధన ఎగుమతులు ఇండియా నుంచి పెరిగాయి. ఓ రిపోర్టు ప్రకారం భారతదేశం జనవరిలో రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురును కొనుగోలు చేసింది. గతేడాదితో పోలిస్తే రష్యా నుంచి 33 రెట్లు అధికంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది భారత్. సాంప్రదాయ ఆయిల్ ఎగుమతిదారులైన ఇరాక్, సౌదీ అరేబియాలను వెనక్కి నెట్టేసి రష్యా మొదటిస్థానానికి చేరుకుంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
Read Also: Donald Trump: అరెస్ట్ తర్వాత అమాంతం పెరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ…
రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ను భారత రిఫైనరీల్లో శుద్ధి చేసి ఐరోపాకు డిజీల్, జెట్ ఇంధనాల ఎగుమతి చేస్తోందని షిఫ్ ట్రాకింగ్ డేటా కెప్లర్, వర్టెక్సా వంటి సంస్థలు డేటా చూపిస్తోందని రాయిటర్స్ నివేదించింది. దీంతో భారత రిఫైనరీలకు లాభాలు పెరిగాయి. భారత్ నుంచి ప్రధానంగా ఫ్రాన్స్, టర్కీ, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలకు డీజిల్ ఎగుమతి అవుతోంది. యూరప్ రోజుకు 154,000 నుండి 200,000 బారెల్స్ వరకు డిజల్, జెట్ ఇంధనాన్ని ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటోంది.
2022-23లో భారత రిఫైనరీలు రోజుకు 970,000-981,000 బ్యారెళ్ల ఆయిల్ దిగుమతి చేసుకుంది. రష్యాలో అతిపెద్ద ఆయిల్ కంపెనీ రోస్ నెఫ్ట్, భారతీయ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య ఇటీవల ఒప్పందం కూడా కుదిరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ డిజిల్ ఎగుమతులు 12-16 శాతం పెరిగి రోజుకు 150,000-167,000 బ్యారెళ్లకు చేరుకుంది. ఇది మొత్తం భారతదేశ గ్యాసోయిల్ ఎగుమతుల్లో 30 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది 21-24 శాతం ఉండేది. ఇదే కాకుండా భారత్ అమెరికాకు వాక్యూమ్ గ్యాస్ ఆయిల్ ఎగుమతిని కూడా పెంచినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!