Pakistan Economic Crisis: పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతోంది. ఆ దేశానికి మిత్రదేశాలతో పాటు ఐఎంఎఫ్ వద్ద అప్పు పుట్టడం లేదు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక వేళ ఎంత ధర పెట్టి కొందాం అని అనుకున్న మార్కెట్లలో సరుకులు లభించడం లేదు. గోధుమ పిండి కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గోధుమ కోసం అక్కడి ప్రజలు ఓ యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే గోధుమ పిండి కేంద్రాల వద్ద ఇటీవల కాలంలో తొక్కిసలాటలు జరిగి 20 మంది మరణించారు.
Read Also: IMF: 2023 ప్రపంచవృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే..
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ పెట్రోలియం శాఖ సహాయమంత్రి ముసాదిక్ మాలిక్ మాట్లాడుతూ.. దేశం ప్రభుత్వం ప్రజలకు 24 గంటలు గ్యాస్ సరఫరా చేయలేదని అన్నారు. ప్రజలకు అందించే గ్యాస్ విషయంలో పాక్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతున్న నేపథ్యంలో లోడ్ షెడ్డింగ్ ప్రతీ రోజూ జరుగుతోందని అన్నారు. ప్రజలు ఎదర్కొంటున్న గ్యాస్ సరఫరా సమస్యను పరిష్కరించడానికి తాను కరాచీ సందర్శిస్తానని అన్నారు. ధనవంతులు, పేదవారికి గ్యాస్ బిల్లు వేరు చేయబడిందని, ఇప్పుడు ధనవంతులు మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
ప్రధాని షెషబాజ్ షరీఫ్ నిరంతరాయంగా గ్యాస్ సరఫరా అయ్యేలా చూడాలని అదికారులను ఆదేశించారని, గత వారం గ్యాస్ సరఫరా తగ్గడంతో విద్యుత్ ప్లాంట్లు, పరిశ్రమలకు సరఫరాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ద్రవ్యోల్భణం 50 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ఐఎంఎఫ్ నుంచి బెయిలౌట్ సాయం కింద 1.1 బిలియన్లను పాక్ ప్రభుత్వం కోరుతోంది. అయితే ఐఎంఎఫ్ అనేక షరతులను పాకిస్తాన్ కు విధించింది. గతిలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ కూడా వాటిని అమలు చేస్తోంది. అయితే ఇన్నీ చేసినా కూడా ఇప్పటి వరకు ఐఎంఎఫ్ ఆర్థిక సాయాన్ని విడుదల చేయలేదు.