Mahindra Thar: ఏప్రిల్ ఆఫర్.. మహీంద్రా థార్‌పై భారీ డిస్కౌంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra Thar: దేశీయ కార్ మేకర్ దిగ్గజం మహీంద్రా తన థార్ మోడల్ పై ఏప్రిల్ నెలలో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా ఎక్కువగా అమ్ముడవుతున్న SUVలలో మహీంద్రా థార్ ఒకటి. కంపెనీ థార్ 4X4 వెర్షన్‌పై ఆకర్షణీయమైన తగ్గింపును అందిస్తోంది. థార్(ఫోర్ వీల్ డ్రైవ్) పెట్రోల్, డిజిల్ వేరియంట్లపై దాదాపుగా రూ. 40,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం థార్ AX (O), LX వేరియంట్లలో లభిస్తోంది.
థార్ మూడు పవర్‌ట్రెయిన్లతో అందుబాటులో ఉంది. 1.5 డిజిల్ ఇంజిన్ లో 6స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో రేర్ వీల్ డ్రైవ్(RWD), 2.2 లీటర్ మాన్యువల్, ఆటోమోటివ్ గేర్ బాక్స్ తో 4 వీల్ డ్రైవ్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్లతో ఫోర్ వీల్, రేర్ వీల్ డ్రైవ్ తో థార్ అందుబాటులో ఉంది.
Also Read
- Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
- New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
Read Also: Pakistan Economic Crisis: ప్రజలకు 24 గంటలు గ్యాస్ అందించలేము.. పాక్ మంత్రి
1.5 లీటర్ డిజిల్ ఇంజిన్లు 300 ఎన్ఎం టార్క్ తో 118 బీహెచ్పీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 2.2 లీటర్ డిజిల్ ఇంజిన్ 300 ఎన్ఎం టార్క్, 130 బీహెచ్పీ పవర్ జనరేట్ చేస్తుంది. ఇక పెట్రోల్ ఇంజిన్ 300 ఎన్ఎం టార్క్ తో 152 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మహీంద్రా థార్ 4X4 వెర్షన్ ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్‌తో వస్తుంది, ఇది తక్కువ ట్రాక్షన్ రోడ్‌లలో మెరుగైన గ్రిప్‌ని అందిస్తుంది.
మహీంద్రా థార్ త్వరలో కొత్త ఎంట్రీ లెవల్ 4X4 వేరియంట్‌ను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది AX (O) వేరియంట్ తో రాబోతోంది. 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డిజిల్ ఇంజిన్లలో ఈ ఎంట్రీ లెవల్ థార్ రానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహీంద్రా 5 డోర్ల థార్ ను పరీక్షిస్తోంది. ఫోర్స్ గూర్ఖా, మారుతీ సుజుకీ జిమ్నీ వంటివి 5 డోర్ వెర్షన్ లో వస్తుండటంతో థార్ కు గట్టిపోటీ ఎదురవుతోంది. దీంతో త్వరలోనే తన 5 డోర్ థార్ ను విడుదల చేసేందుకు పరీక్షలు నిర్వహిస్తోంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!