IMF: 2023 ప్రపంచవృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMF: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3 శాతం కన్నా తక్కువ వృద్ధిని సాధిస్తుందని, 2023లో ప్రపంచవృద్ధిలో భారత్, చైనాల వాటానే సగం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ గురువారం తెలిపారు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైెరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రం ప్రభావం చూపించాయని, దీంతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని ఆమె హెచ్చరించారు.
Read Also: Jai SriRam : అయోధ్య రాముడికి 155 దేశాల నదుల నీటితో మహా జలాభిషేకం
Also Read
1990 తర్వాత అత్యల్ప వృద్ధి అంచనా ఇదే. గత రెండు దశాబ్ధాల నుంచి సగటున 3.8 కంటే తక్కువగా ఈ ఏడాది వృద్ధి నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. రానున్న ఐదేళ్లలో ఆర్థిక మందగమనం ఉంటుందని, 3 శాతం కన్నా తక్కువ వృద్ధి నమోదుయ్యే అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆసియా దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆశాకిరణంగా కనిపిస్తున్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక వ్యవస్థ ఊపందుకుందని తెలిపారు. 2023 లో భారతదేశం, చైనా ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటాను కలిగి ఉంటాయని అన్నారు.
2021 మహమ్మారి నుంచి కోలుకుంటున్న సమయంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలకిందులుగా చేసిందని, ప్రపంచ వృద్ధి 6.1 శాతం నుంచి 3.4 శాతానికి పడిపోయిందని ఆమె వెల్లడించారు. తక్కువ ఆదాయ దేశాలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవచ్చని, పేదరికం, ఆకలి మరింత పెరగవచ్చని జార్జివా వివరించారు. 90 శాతం అడ్వాన్స్‌డ్ ఎకానమీలు కలిగిన దేశాలు తమ వృద్ధి రేటులో క్షీణతను చూస్తాయని అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే కేవలం భారత్ మాత్రమే ఈ ఏడాది 6 శాతం కన్నా ఎక్కువ వృద్ధిరేటు నమోదు చేస్తుందని ఇటీవల ఐఎంఎఫ్ ప్రకటించింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు కూడా ఈ ఏడాది భారత్ వృద్ధిరేటు 6.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
తాజావార్తలు
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!