Ajit Pawar: ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు ఎన్సీపీ నేత అజిత్ పవార్. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దేశంలోని అనేక మారుమూల ప్రాంతాలకు విస్తరించిందని ఆయన శనివారం అన్నారు. మోడీ గెలిచిన తర్వాత ప్రజాదరణ పొందారని, బీజేపీ వివిధ రాష్ట్రాల్లో గెలిచిందని,
Kiren Rijiju: 2019 క్రిమినల్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుక నరికివేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు బెదిరించడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా శనివారం ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిరాశాలో ఉందని, న్యాయవ్యవస్థపై దాడి చేస్తోందని అన్నారు. కానీ ఇలాంటి వాటిపై ప్రభుత్వం సైలెంట్ గా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
China VS Taiwan: తైవాన్ ద్వీపకల్పాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ప్లాన్ చేస్తోంది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారీ యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లతో తైవాన్ ద్వీపాన్ని చుట్టుముడుతోంది చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ). తైవాన్ అధ్యక్షురాలు అమెరికా పర్యటనకు వెళ్లడం, అక్కడ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ తో భేటీ కావడం చైనాకు రుచించలేదు. ఈ చర్య అనంతరం తైవాన్ ను కబలించేందుకు చైనా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం భారీ ఎత్తున తైవాన్ కు సమీపంలో చైనీస్…
Bharat Express Train: ప్రధాని నరేంద్రమోదీ శనివారం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో వందేభారత్ ట్రైన్ తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో 12వ వందేభారత్ రైలును ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం అనంతరం తమిళనాడు పర్యటకు వెళ్లారు.
Rise In Temperature: ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. అయితే రాబోయే 5 రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు దంచి కొట్టనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఉరుములు, బలమైన ఈదురుగాలులతో వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Iran: ఇరాన్ దేశంలో ముస్లిం మతాచారాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలుసు. ముఖ్యంగా హిజాబ్ అంశంలో ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. గతేడాది మహ్సా అమిని అనే మహిళ హిజాబ్ సరిగ్గా ధరించని కారణంగా ఇరాన్ మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరువాత ఆ అమ్మాయి చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు, యువత ప్రభుత్వానికి, హిజాబ్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేశారు. మహిళలు హిజాబ్ తీసివేసి, జట్టు కత్తిరించుకుని నిరసన తెలిపారు.
CR Kesavan: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి ముని మనవడు సిఆర్ కేశవన్ శనివారం బిజెపిలో చేరారు. దక్షిణాదిలో మరింగా విస్తరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే దక్షిణాదికి చెందిన ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకుంటోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేశవన్ బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికతో కాంగ్రెస్కు మరో షాక్ తగిలినట్లు అయింది. కేంద్ర మంత్రి వీకే సింగ్, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బలూనీ సమక్షంలో ఆయన పార్టీలో…
Israel: మధ్యప్రాచ్చంలో ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం రోజు జెరూసలెంలోని ప్రఖ్యాత అల్-అక్సా మసీదులో ఘర్షణ తర్వాత ఇజ్రాయిల్ వరసగా దాడులను ఎదుర్కొంటోంది. అల్-అక్సా ఘటన తర్వాత పాలస్తీనా గాజా నుంచి, లెబనాన్ నుంచి రాకెట్ దాడులను ఎదర్కొంది ఇజ్రాయిల్. దీనికి ప్రతీగా ఇజ్రాయిల్ పాలస్తీనా, లెబనాన్ పై వైమానిక దాడులు చేస్తోంది.
Rare Earth Elements Reserve In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన మూలకాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జిఆర్ఐ) శాస్త్రవేత్తలు పరిశోధించగా అక్కడి నేలల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కనుగొన్నట్లు వెల్లడించారు.
Boney Kapoor: కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీలు నువ్వానేనా అన్న రీతిలో పోటీ పడుతున్నాయి. డబ్బు, మద్యంతో ప్రలోభాల పర్వం ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ కార్లలో పెద్ద ఎత్తున వెండి వస్తువులు బయటపడ్డాయి. ఎన్నికల కమీషన్ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తు్న్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.