Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఆయన అసమర్థత వల్లే అమెరికా ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతుందని విమర్శిస్తు్న్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ ఆరోపణలతో పలు కేసులను ఎదుర్కొంటున్నారు ట్రంప్.
Suella Braverman: బ్రిటిష్ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అక్కడ ‘‘గ్రూమింగ్ గ్యాంగులు’’ రెచ్చిపోతున్నాయి. టీనేజ్ అమ్మాయిలను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్న గ్యాంగులను అణిచివేస్తానని గతేడాది జరిగిన ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ ప్రధాన హమీల్లో ఒకటిగా ఉంది. తాజాగా బ్రిటన్ హోం మినిస్టర్ సువెల్ల బ్రావెర్ మాన్ ఇంగ్లీష్ అమ్మాయిలపై వేధింపుకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
Around 1 in 6 people worldwide experience infertility: ప్రతీ ఆరుగురిలో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) తన కొత్త నివేదికలో పేర్కొంది. మొత్తం వయోజన జనాభాలో 17.5 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు తెలిపింది. ఈ సమస్యను అధిగమించేందుకు సంతాన సాఫల్యత చర్యలను చేపట్టాలని, అవి అందరికి అందుబాటులో ఉండాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
Kedarnath Dham: కేదార్ నాథ్ ధామ్ పోర్టల్ ను భక్తులందరకీ ఏప్రిల్ 25న తెరవనున్నట్లు అధికారులు ఈ రోజు తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి ఈ కేధార్ నాథ్ యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. భక్తులు కాలినడకతో పాటు హెలికాప్టర్ ద్వారా కేదార్ నాథ్ ధామ్ చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. కేదార్నాథ్ ధామ్‌కు హెలికాప్టర్లో ప్రయాణించే యాత్రికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించనుంది.
Kerala Train Attack: కేరళ ట్రైన్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ట్రైన్ లో నిప్పంటించి ముగ్గురు మరణాలకు కారణం అయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఉగ్రవాద కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు షారుఖ్ సైఫీని మహారాష్ట్రలోని రత్నగిరి రైల్వే స్టేషన్ లో నిన్న రాత్రి పట్టుకున్నారు. మహరాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ లో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.
Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఆయనకు బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై కిచ్చా సుదీప్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Corona Cases In India: దేశంలో నెమ్మదిగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,435 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ చివరి నాటితో పోలిస్తే ఇప్పుడే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. 163 రోజులలో ఈ రోజే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 25న 4,777 కేసులు నమోదయ్యాయి.
Earth-like exoplanet: ఈ అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాన్ని కొన్ని ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు. భూమిలా జీవానికి అవసరం అయ్యే పరిస్థితుల ఏ గ్రహానికైనా ఉన్నాయా అని మన పాలపుంతలో శాస్త్రవేత్తలు గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్ని వందల ఎక్సో ప్లానెట్స్ గుర్తించినప్పటికీ భూమిని పోలిన గ్రహాల్లో జీవాలు ఉండే అవకాశం మాత్రం దాదాపుగా తక్కువే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Earthquake: పసిఫిక్ తీరంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పనామాలోని పసిఫిక్ తీరంలోని బోకా చికా పట్టణానికి సమీపంలో మంగళవారం ఈ భూకంప వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. స్థానిక కాలమాన ప్రకారం 5.18 గంటలకు భూకంపం వచ్చింది. భూకంప కేంద్ర బోకా చికాకు దక్షిణంగా 71 కిలోమీటర్ల దూరంలో, 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
Arunachal Pradesh: భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు చైనా పేర్లను పెట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పేర్లు మార్చడం ద్వారా వాస్తవ పరిస్థితిని మార్చలేరని, చైనా తీరును ఖండించింది భారత్. చాలా ఏళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అని దక్షిణ టిబెట్ పేరుతో పలుస్తోంది చైనా. ఇంతకుముందు కూడా రెండు సార్లు ఇలాగే పేర్లను మార్చింది.