Delhi High Court: మహిళల ప్రైవసీకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాత్ రూంలో స్నానం చేయడమనేది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం అని, ఒక వేళ బాత్ రూం ఇంటి బయట ఉన్నా, తాత్కాలిక నిర్మాణమైనంత మాత్రాన అక్కడ స్నానం చేయడం బహిరంగ చర్యగా పేర్కొనలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఒక వేళ ఆ గది పక్కన ఉన్న మరో గదిలోకి వెళ్లిన వ్యక్తి చర్యల వల్ల మహిళల ప్రైవసీకి భంగం కలిగితే శిక్షించవచ్చని తేల్చి చెప్పింది.
Read Also: KKR vs RCB: కేకేఆర్ చేతిలో ఆర్సీబీ ఘోర పరాజయం
ఒక మహిళ బాత్ రూంలో ఉండగా, దాని పక్క గదిలో ఉన్న వ్యక్తి తనలో తాను శృంగారపరమైన వ్యాఖ్యలు చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుకుంటూ ఉండటాన్ని తప్పుగా పరిగణించకపోవచ్చు, కానీ అతని మాటల వల్ల గదిలో ఉన్న మహిళ ప్రైవసీకి భంగం కలిగితే ఐపీసీ సెక్షన్ 354సీ సెక్షన్ వర్తిస్తుందని, దాని ప్రకారం శిక్షార్హుడే అని జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్పష్టం చేశారు. ఈ కేసులో ఓ వ్యక్తి విధించిన ఏడాది జైలు శిక్షను కోర్టు సమర్థించింది. అయితే ఈ సంఘటన జరిగిన 2014 నాటికి బాధిత మహిళ మైనర్ కానుందు వల్ల పోక్సో చట్టం కింద నమోదు చేసిన కేసు నుంచి నిందితుడికి విముక్తి కల్పించారు.